close

తాజా వార్తలు

రాజమౌళి పిలుపు అందిందా?

రాజమౌళి పిలుపు అందిందా?

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ‘RRR’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాక్సింగ్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో తారక్‌, చెర్రీ సోదరుల పాత్రల్లో సందడి చేయనున్నట్లు ప్రచారం జరిగింది. డిసెంబరులో షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

 ఈ సినిమా కోసం తారక్‌, చెర్రీ ప్రత్యేక వర్క్‌షాప్‌కు హాజరుకానున్నారట. ఈ మేరకు రాజమౌళి ఇద్దరు స్టార్స్‌కు సమాచారం అందించినట్లు చెబుతున్నారు. ఈ వర్క్‌షాప్‌లో రాజమౌళితోపాటు మిగిలిన సాంకేతిక బృందం కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. నవంబరులో ఇది జరగనుందట.

ప్రస్తుతం ఈ సినిమాలో నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను నవంబరులో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇందులో కథానాయికలుగా కీర్తి సురేశ్‌, సమంత, రష్మిక తదితరుల పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. 2020లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.