close

తాజా వార్తలు

రాజమౌళి సినిమా.. ఇది నిజమేనా

రాజమౌళి సినిమా.. ఇది నిజమేనా

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ‘RRR’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి బాణీలు అందించనున్నారు. బాక్సింగ్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో తారక్‌, చెర్రీ సోదరుల పాత్రల్లో సందడి చేయనున్నట్లు ప్రచారం జరిగింది.

కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త తెగ ప్రచారంలో ఉంది. రాజమౌళి సినిమా మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ను ప్రారంభించారని చెబుతున్నారు. ప్రస్తుతం కీరవాణి ఈ పనిలోనే ఉన్నారని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. డిసెంబరులో షూటింగ్‌ మొదలు కాబోతోందని తెలిసింది. అయితే దీనిపై రాజమౌళి స్పందించలేదు.

ఈ సినిమా కోసం తారక్‌, చెర్రీ ప్రత్యేక వర్క్‌షాప్‌కు హాజరుకానున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ మేరకు రాజమౌళి ఇద్దరు స్టార్స్‌కు సమాచారం అందించారని, నవంబరులో ఇది జరగనుందని సమాచారం. ఈ వర్క్‌షాప్‌లో వీరితోపాటు మిగిలిన సాంకేతిక బృందం కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. 2020లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందట.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.