close

తాజా వార్తలు

ఈ వ్యక్తిని వెతికిపెడితే రూ.లక్ష ఇస్తా: వర్మ

నెటిజన్లకు ఆర్‌జీవీ ఆఫర్‌

ఈ వ్యక్తిని వెతికిపెడితే రూ.లక్ష ఇస్తా: వర్మ

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ నెటిజన్ల సహాయం కోరుతున్నారు. ఆయన శనివారం ట్విటర్‌లో ఓ వీడియో షేర్‌ చేశారు. అందులో ఓ వ్యక్తి భోజనం చేస్తున్న వారికి చట్నీ వడ్డిస్తూ కనిపించారు. ‘ఈ వ్యక్తి ఎవరో కనిపెట్టేందుకు నాకు ఎవరైనా సహాయం చేస్తారా?.. ఆయన్ను నాకు పరిచయం చేసిన వ్యక్తి ఎవరైనా సరే వారికి రూ.లక్ష బహుమతిగా ఇస్తా. ఆయన ఆచూకీ దొరికితే నా ఈ మెయిల్‌ Laksmisntr@gmail.com కు వివరాలు పంపండి. మొదట సమాచారం పంపిన వ్యక్తికే రూ.లక్ష అందుతుంది’ అని వర్మ ట్వీట్లు‌ చేశారు.

తన తర్వాతి సినిమా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’లోని పాత్ర కోసం వర్మ వీడియోలో ఉన్న వ్యక్తిని వెతుకుతున్నట్లు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కామెంట్లు చేశారు. వివరాలు తెలిస్తే తప్పక సమాచారం ఇస్తామని అన్నారు.

ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్‌, ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి జీవితం ఆధారంగా వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాను తీయనున్నారు. ఈ చిత్రాన్ని లక్ష్మీ పార్వతి దృష్టికోణం నుంచి ఎన్టీఆర్‌ను చూపించబోతున్నట్లు తెలిపారు. అక్టోబరు 19న తిరుపతిలో సినిమా ప్రారంభోత్సవాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాకేష్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను జీవీ ఫిల్మ్స్‌ పతాకంపై బాల గిరి సమర్పిస్తున్నట్లు తెలిపారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.