
తాజా వార్తలు
అమరావతి: తిత్లీ తుపాను బాధితులను ఆదుకునేందుకు ఒక్కొక్కరూ ముందుకొస్తున్నారు. ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు, అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉదారంగా విరాళాలు అందిస్తున్నారు. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ బాధితులకు బాసటగా నిలిచారు. బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి ఆయన రూ.25లక్షల విరాళాన్ని ప్రకటించారు. మరోవైపు రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం కూడా విరాళం ప్రకటించింది. ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందజేయనున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు శశిభూషణ్ తెలిపారు. ఇప్పటికే సహాయక చర్యల్లో పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులు శ్రమిస్తున్నారని ఆయన చెప్పారు.
ప్రతి ఒక్కరూ సహకరించాలి: మంత్రి లోకేశ్
తిత్లీ తుపానుతో తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లా తిరిగి సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, తమ వంతు సహకారాన్ని అందించాలని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. నష్టం అంచనా వేయడానికి, బాధాతప్త హృదయాల్లో భరోసా కల్పించి ఆదుకోవడానికి ప్రభుత్వం నిర్విరామంగా పనిచేస్తోందని చెప్పారు. విరాళాలు ఇచ్చేవారు ముఖ్యమంత్రి సహాయనిధికి పంపాలని లోకేశ్ కోరారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
