close

తాజా వార్తలు

‘రెచ్చిపోదాం బ్రదరూ..’

‘f2’ తొలి పాట చూశారా..!

‘రెచ్చిపోదాం బ్రదరూ..’

హైదరాబాద్‌: వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా నటించిన మల్టీస్టారర్‌ ‘f2’. ‘ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్’‌ అనేది ఉప శీర్షిక. అనిల్‌ రావిపూడి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

‘ఒక చరిత్ర గురించి చెప్పాలంటే క్రీస్తుపూర్వం, క్రీస్తుశకం అంటాం.. ఒక మగాడి గురించి చెప్పాలంటే పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత..’ అంటూ ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు విశేష స్పందన లభించింది. కాగా ఇందులోని మొదటి పాట టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. ‘క్రికెట్‌ ఆడే బంతికి రెస్టే దొరికినట్టు ఉందిరో.. 1947 ఆగస్టు 15ని నేడే చూసినట్లు ఉందిరో.. రెచ్చిపోదాం బ్రదర్‌..’ అని సాగే ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది. వెంకీ, వరుణ్‌, రాజేంద్ర ప్రసాద్‌ కలిసి ఆనందంగా సందడి చేస్తూ కనిపించారు.

వరుణ్‌ ప్రస్తుతం ‘అంతరిక్షం’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు. శుక్రవారం ఈ చిత్రం విడుదల కాబోతోంది. సంకల్ప్‌ దర్శకుడు. అదితిరావు హైదరి, లావణ్య త్రిపాఠి కథానాయికల పాత్రలు పోషించారు. దిల్‌రాజు నిర్మాత. అంతరిక్షం నేపథ్యంలో సాగే కథే ఇది. వెంకీ ప్రస్తుతం ‘వెంకీ మామ’ చిత్రంలో నటిస్తున్నారు.

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.