close

తాజా వార్తలు

సూపర్‌స్టార్‌ను ఆహ్వానించిన బాలకృష్ణ

సూపర్‌స్టార్‌ను ఆహ్వానించిన బాలకృష్ణ

హైదరాబాద్‌: అలనాటి నటుడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం ‘యన్‌టిఆర్‌’. ఈ చిత్ర ఆడియో లాంచ్‌ వేడుకను ఈరోజు అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఇదే వేడుకలో ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నారు. అయితే ఈ వేడుకకు సూపర్‌స్టార్‌ కృష్ణ అతిథిగా విచ్చేయనున్నారు. గురువారం బాలకృష్ణ..స్వయంగా కృష్ణ నివాసానికి వెళ్లి మరీ ఆయన్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా నరేశ్‌, కృష్ణ, బాలకృష్ణ కలిసి దిగిన ఫొటోలను చిత్రబృందం ట్విటర్‌ వేదికగా పంచుకుంది.

సూపర్‌స్టార్‌ను ఆహ్వానించిన బాలకృష్ణ

ఈ సందర్భంగా ‘యన్‌టిఆర్’ సినిమాలో బాలకృష్ణ తండ్రి పాత్ర కోసం వేసిన గెటప్స్‌ తనకు నచ్చాయని కృష్ణ మెచ్చుకున్నారట. ఈ చిత్రం తెలుగు సినీ పరిశ్రమలో మైలురాయిలా నిలిచిపోతుందని కొనియాడారని, చిత్రబృందానికి విషెస్‌ తెలిపారని సినీ వర్గాలు తెలిపాయి. ‘యన్‌టిఆర్‌’ చిత్రానికి క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఎన్‌బీకే ఫిలింస్‌ బ్యానర్‌పై బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’గా వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈరోజు విడుదల కాబోయే ట్రైలర్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సూపర్‌స్టార్‌ను ఆహ్వానించిన బాలకృష్ణ


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.