
తాజా వార్తలు
హైదరాబాద్: విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు కథానాయకుడు శ్రీవిష్ణు. ‘వీర భోగ వసంత రాయలు’ చిత్రం తర్వాత ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బ్రోచేవారెవరురా’. వివేక్ ఆత్రేయ దర్శకుడు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఈరోజు విడుదల చేశారు. లుక్‌లో నీలం రంగులో ఉన్న దిష్టిబొమ్మను చూపిస్తూ.. దాని కింద ‘ఇరుగు దిష్టి.. పొరుగు దిష్టి..ఊళ్లోవాళ్లందరి దిష్టి ఈ 2019లో మీకెవ్వరికీ తగలకూడదని ఆశిస్తూ శుభంభూయాత్’ అని రాశారు. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా ఉండబోతోందని ఫస్ట్‌లుక్‌ను బట్టి అర్థం అవుతోంది. నివేదా థామస్, నివేదా పేతురాజ్ కథానాయికలు. విజయ్ కుమార్ మన్యం నిర్మాత. సత్యదేవ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- ఎన్‌కౌంటర్‌తో న్యాయం జరగలేదు
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఆ కిరాతకులు ఎలా దొరికారు?
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- ఆ రెండు రోజులూ ఏం జరిగింది?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
