close

తాజా వార్తలు

కుటుంబంతో విచ్చేసిన ‘యన్‌టిఆర్‌’

న్యూఇయర్ ‌సందర్భంగా ఆసక్తికరమైన పోస్టర్‌

కుటుంబంతో విచ్చేసిన ‘యన్‌టిఆర్‌’


హైదరాబాద్‌: నూతన సంవత్సరం సందర్భంగా ‘యన్‌టిఆర్‌’ తన కుటుంబంతో విచ్చేసి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశారు. అలనాటి నటుడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యన్‌టిఆర్‌’. క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు నూతన సంవత్సరం సందర్భంగానే కాదు.. ఇందులో బసవతారకం పాత్రలో నటిస్తున్న విద్యా బాలన్‌ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. పోస్టర్‌లో ఎన్టీఆర్‌(బాలకృష్ణ‌)..తన సతీమణి బసవతారకం(విద్యాబాలన్‌)తో కలిసి మనవడికి నామకరణం చేస్తున్నట్లుగా కనిపించారు. ఈ పోస్టర్‌ అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది. ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ టైటిల్స్‌తో రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఎన్‌బీకే ఫిలింస్‌ బ్యానర్‌పై బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

కుటుంబంతో విచ్చేసిన ‘యన్‌టిఆర్‌’


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.