
తాజా వార్తలు
ముంబయి: బాలీవుడ్ కథానాయకుడు రణ్వీర్ ‘సింబా’ తర్వాత ‘83’ సినిమాకు సిద్ధమౌతున్నారు. కపిల్‌దేవ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. కాగా ఇందులో కపిల్‌దేవ్ సతీమణి పాత్రను దీపికా పదుకొణె పోషించనున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే వీటిపై దీపిక ప్రతినిధులు తాజాగా స్పందించారట. ‘‘83’ అనేది యువకుల సినిమా. కపిల్‌దేవ్, ఆయన టీం ప్రపంచ కప్‌ను సాధించే నేపథ్యంలోనే ఉంటుంది. రణ్వీర్.. కపిల్‌దేవ్‌గా నటిస్తున్నారు. దీపిక ఆయన సతీమణి రోమీ భటియాగా చేస్తున్నారని వచ్చిన వార్తల్లో నిజం లేదు. కపిల్ దేవ్ భార్య పాత్రకు సినిమాలో చాలా తక్కువ ప్రాముఖ్యం ఉంది. దీపికకు ఓ బ్రాండ్ ఉంది. ఆమె కేవలం తన భర్త (రణ్వీర్) కోసం సినిమా చేయలేరు’ అని వారు పేర్కొన్నట్లు బాలీవుడ్ సమాచారం. కపిల్ దేవ్ పాత్రకు సిద్ధమౌతున్నట్లు తాజాగా రణ్వీర్ తెలిపారు. క్రికెట్ సాధన చేస్తున్న ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.
రణ్వీర్ ఇటీవల ‘సింబా’తో మంచి సక్సెస్ అందుకున్నారు. తెలుగు హిట్ ‘టెంపర్’కు హిందీ రీమేక్‌గా రూపొందిన ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.200 కోట్లకుపైగా వసూలు చేసింది. ‘పద్మావత్’ తర్వాత దీపిక ‘ఛపాక్’ సినిమాలో నటిస్తున్నారు. మేఘనా గుల్జార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా ఇది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- జయలలితగా రమ్యకృష్ణను చూశారా?
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- ‘అతను నన్ను చంపాలని చూస్తున్నాడు’
- భయం.. కోపం రెండూ వస్తున్నాయి!
- ఆ పాత్రకు అరవిందస్వామి అనుకున్నారట!
- ఎంజీ విద్యుత్తు కారు విశేషాలు ఇవే..
- ఇంటి వరకూ తోడుగా వస్తారు!
- మీ షేర్లు భద్రపర్చుకోండిలా..!
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ఎందుకా పైశాచికం?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
