
తాజా వార్తలు
ఫిట్ మంత్ర
నాకు థైరాయిడ్ ఉంది. సిజేరియన్ అయ్యాక నడుముకట్టు వేసుకోలేదు. దాంతో పొట్టభాగంలో కొవ్వు పేరుకుపోయింది. రకరకాల డ్రెస్‌లు వేసుకోలేకపోతున్నా. ఈ సమస్య తగ్గాలంటే ఏం చేయాలి? కొత్తగా గ్రీన్‌టీ తాగడం అలవాటు చేసుకున్నా. ఇంకేం చేయాల్సి ఉంటుంది?
- ఓ సోదరి
ప్రసవం తరువాత పొట్ట చుట్టూ గట్టిగా కట్టు కట్టుకుంటే కండరాలు బిగుతుగా ఉంటాయనుకుంటారు. కానీ దానివల్ల పొట్ట, నడుము భాగానికి కేవలం ఆసరా దొరుకుతుంది తప్ప ఆ కండరాలు దృఢంగా మారవు. కేవలం పొట్ట మరీ సాగకుండా ఉంటుంది. ఆహారం తక్కువ తీసుకోగలుగుతారు. వ్యాయామం వల్లే మార్పు ఉంటుంది. మీరు రెండు మూడు రకాల వ్యాయామాలు చేయాలి. మీకు సిజేరియన్ జరిగి ఆరు నెలలు దాటితే గనుక టమ్మీ టక్ వ్యాయామంతో ప్రారంభించండి. పొట్టను వెనక్కి లాగుతూ కాసేపు అలాగే ఉంచాలి. కొన్ని సెకన్లు అయ్యాక వదిలేయాలి. ఐదు సెకన్లతో మొదలుపెట్టి నిమిషం వరకూ చేయాలి. దీనివల్ల కండరాలు దృఢంగా మారతాయి. అలాగే వెల్లకిలా పడుకుని ఒక కాలిని వేగంగా పైకెత్తి, తరువాత నిదానంగా దించాలి. ఇదే విధంగా మరో కాలిని ఎత్తి దించాలి. ఆ తరువాత రెండుకాళ్లు పైకెత్తి దించాలి. ఈ వ్యాయామాలు చేస్తున్నప్పుడు ఛాతీ, మెడ ఎత్తకుండా చేయాలి. ఈ రెండూ అయ్యాక కాళ్లనే సైకిల్లా తిప్పాలి. రెండుకాళ్లతో ఒకేసారి చేయాలి. ఈ మూడు వ్యాయామాల్ని పదితో మొదలుపెట్టి విరామం ఇస్తూ సంఖ్యను పెంచుకుంటూ వెళ్లాలి.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- ఆలియా మెచ్చిన తెలుగు హీరో..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
