close

తాజా వార్తలు

సినిమాల్లోకి సూర్య కుమారుడు..!

సినిమాల్లోకి సూర్య కుమారుడు..!

చెన్నై: ప్రముఖ సినీ నటుడు సూర్య కుమారుడు దేవ్‌ సినిమాల్లోకి రాబోతున్నాడా? అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. ఎనిమిదేళ్ల దేవ్‌ ప్రధాన పాత్రలో ఓ చిత్రంలో నటించబోతున్నాడట. కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. ఓ ఎనిమిదేళ్ల బాలుడికి కుక్కపిల్లకి మధ్య ఉన్న అనుబంధం నేపథ్యంలో సినిమా ఉండబోతోందని కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.

సినిమాల్లోకి సూర్య కుమారుడు..!

ఈ సినిమా కోసం గతంలో 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ చైల్డ్‌ ఆర్టిస్ట్‌లను పిలిపించి ఆడిషన్‌ నిర్వహించింది. మొత్తానికి సూర్య కుమారుడిని ప్రధాన పాత్రలో ఎంపిక చేసినట్లు టాక్‌. దేవ్‌తో పాటు సినిమాలో మరో 30 మంది పిల్లలు నటించనున్నారట. అయితే ఈ విషయమై సూర్య నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే పలువరు సూపర్‌స్టార్ల వారసులు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టేశారు. విక్రమ్‌ కుమారుడు ధృవ్‌ ‘వర్మ’ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఇక విజయ్‌ కుమారుడు సంజయ్‌ దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.