close

తాజా వార్తలు

తెలుగులోనూ ‘83’ విజయగాథ

ణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘83’. భారత క్రికెట్‌ జట్టు 1983లో ప్రపంచ కప్‌ విజేతగా నిలిచిన చారిత్రక ఘట్టం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. అప్పటి జట్టుకు సారథ్యం వహించిన కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ నటిస్తున్నారు. కబీర్‌ ఖాన్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ తెరకెక్కించబోతున్నారు. భారత జట్టు సాధించిన చారిత్రక విజయం భాషలకతీతంగా దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులందరూ తెలుసుకోవాల్సిన కథ అని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చిత్రబృందం తెలిపింది. దీంతో ఇది  రణ్‌వీర్‌ సింగ్‌కు తొలి త్రిభాషా చిత్రంగా  నిలిచింది. తన పాత్రకు సంబంధించి రణ్‌వీర్‌  కసరత్తులు మొదలుపెట్టారు. క్రికెట్‌లో  మెలకువల కోసం శిక్షణ తీసుకుంటున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.