close

తాజా వార్తలు

ఎన్టీఆర్‌ స్వర్గం నుంచి హెచ్చరించారు: వర్మ

అందుకే ఇలా చేస్తున్నా..

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ‘యన్‌.టి.ఆర్‌-మహానాయకుడు’ విడుదల తేదీని ప్రకటించిన తర్వాత వెల్లడిస్తానని వర్మ ట్వీట్లు చేశారు. ఇలా చేయమని ఎన్టీఆర్‌ స్వర్గం నుంచి తనను హెచ్చరించారని ఆయన అన్నారు. ఎన్టీఆర్‌ ఆశీర్వాదాలు తన సినిమాకు ఉన్నాయని చెప్పారు.

ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి జీవితాల ఆధారంగా ఈ సినిమాను వర్మ తెరకెక్కిస్తున్నారు. ఇందులో లక్ష్మీ పార్వతిగా కన్నడ నటి యజ్ఞ శెట్టి నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ పాత్రను పశ్చిమ గోదావరికి చెందిన రంగస్థల నటుడు పోషిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌.ఎమ్‌. కీరవాణి సోదరుడు కల్యాణి‌ మాలిక్‌ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రంలోని రెండు పాటల్ని వర్మ విడుదల చేశారు. ఇందులోని ఓ పాటను వ్యతిరేకిస్తూ తెదేపా నాయకులు ఆందోళన చేశారు.

ఇటీవల చిత్రంలో లక్ష్మీ పార్వతి, నారా చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్‌ పాత్రల లుక్‌లను వర్మ విడుదల చేశారు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్‌ను కూడా వర్మ తరచూ షేర్‌ చేస్తూ ఉన్నారు. ఫిబ్రవరి 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని వర్మ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.