close

తాజా వార్తలు

కచ్చితంగా సినిమా బాగొస్తుంది: సైనా

‘థియేటర్‌కు వెళ్లి చూసే మొదటి వ్యక్తిని నేనే’

ముంబయి: ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ జీవితం ఆధారంగా సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ‘సైనా’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ నటిస్తున్నారు. అమోల్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్‌ పతాకంపై భూషణ్‌ కుమార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబరులో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ బయోపిక్‌ కోసం శ్రద్ధకు సైనా బ్యాడ్మింటన్‌లో ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చారు.

ఈ సినిమా గురించి మీడియా తాజాగా సైనాను ప్రశ్నించింది. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నా. స్క్రిప్టు చాలా బాగుంది. శ్రద్ధా ఈ సినిమా కోసం చాలా సాధన చేసింది, బాగా నటిస్తోంది. మీలాగే నేను ఎదురుచూస్తున్నా. సినిమా పూర్తి కావడానికి ఇంకొన్ని రోజులు పడుతుంది. కానీ చిత్రం అవుట్‌పుట్‌ బాగొస్తుందని కచ్చితంగా చెప్పగలను. ప్రతి క్రీడాకారిణి విజయం వెనుక ఓ అద్భుతమైన కథ ఉంటుంది. ఎన్నో కష్టాలు పడుంటారు, సమస్యలు ఎదుర్కొనుంటారు. కాబట్టి ఓ క్రీడాకారిణి జీవితంపై సినిమా తీస్తే కచ్చితంగా బాగుంటుంది. ఇలాంటి సినిమాలు వస్తే మొదట థియేటర్‌కు వెళ్లి చూసే వ్యక్తుల్లో నేను ముందుంటా. ఎందుకంటే.. ఇవి స్ఫూర్తిని కల్గించేలా ఉంటాయి. నా జీవిత కథ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని అన్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.