Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 52352
            [news_title_telugu_html] => 

థాంక్యూ నాగబాబు సర్‌: రష్మి

[news_title_telugu] => థాంక్యూ నాగబాబు సర్‌: రష్మి [news_title_english] => Thank you Naga babu sir for standing up for us [news_short_description] => ప్రముఖ యాంకర్‌ రష్మి.. సినీ నటుడు నాగబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల ఓ ప్రముఖ గాయకుడు హీరోయిన్లు వేసుకునే దుస్తులను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా... [news_tags_keywords] => tollywood,nagababu,Rashmi [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/DS6-wN6-n50 [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-02-05 01:05:51 [news_isactive] => 1 [news_status] => 2 ) )
థాంక్యూ నాగబాబు సర్‌: రష్మి - Thank you Naga babu sir for standing up for us - EENADU
close

తాజా వార్తలు

థాంక్యూ నాగబాబు సర్‌: రష్మి

హైదరాబాద్‌: ప్రముఖ యాంకర్‌ రష్మి.. సినీ నటుడు నాగబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల ఓ ప్రముఖ గాయకుడు హీరోయిన్లు వేసుకునే దుస్తులను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై నాగబాబు స్పందిస్తూ.. తన యూట్యూబ్‌ ఛానెల్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ‘అసలు ఆడవారు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో చెప్పడానికి మీరెవరు? నాకు తెలిసినంతవరకు పొట్టి దుస్తులు వేసుకునే వారిపైనే కాదు.. ఒళ్లంతా నిండుగా కప్పుకొనే ఆడపిల్లల పైనా అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఆడపిల్లలు ఫలానా రకమైన దుస్తులు వేసుకోవడం వల్లే మగవారు వారితో తప్పుగా ప్రవర్తిస్తున్నారని అనుకోవడం తప్పు. ఎలాంటి దుస్తులైనా వేసుకునే హక్కు ఆడవారికి ఉంటుంది. అదే ఆడపిల్ల.. ఓ మగవాడ్ని ‘ప్యాంట్స్‌ వేసుకోవద్దు, అది మన సంప్రదాయం కాదు, పంచెలు కట్టుకోండి’ అని ఎప్పుడైనా అనడం విన్నారా? అసలు మీ కళ్లు ఆడవారి దుస్తులపైకి ఎందుకు వెళ్తున్నాయ్‌?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వీడియోను రష్మి ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘వేసుకునే దుస్తులకు మించి మనిషిలో ఎన్నో గొప్ప విషయాలుంటాయి. ఆ గొప్పతనాన్ని వారు వేసుకునే దుస్తుల దృష్టి నుంచి చూడకండి. మాకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు నాగబాబు సర్‌..’ అని పేర్కొన్నారు.

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.