close

తాజా వార్తలు

క్రిష్‌కు సినిమా చూపించాలనుకున్నాం కానీ..: కంగన

‘కష్టపడుంటే పేరు చెడగొట్టరు’

‘నాకు రహస్యంగా మెసేజ్‌లు చేశారు’

ముంబయి: ‘మణికర్ణిక’ సినిమా విడుదలకు ముందే క్రిష్‌కు చూపించాలి అనుకున్నామని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ అన్నారు. ఈ సినిమా చుట్టూ వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. సినిమా 70 శాతం దర్శకత్వం క్రెడిట్‌ కంగన తీసుకోవడంపై క్రిష్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె ఎడిటింగ్‌ సమయంలో చాలా పాత్రల్ని కట్‌ చేశారని, స్క్రిప్టులో తనకు నచ్చినట్లు మార్పులు చేయమన్నారని ఆయన అన్నారు. ‘‘మణికర్ణిక’ సినిమాకు నేనే దర్శకత్వం వహించా’ అని తొలిసారి ఈ వివాదంపై స్పందిస్తూ కంగన అన్నారు.

తాజాగా కంగన మరోసారి క్రిష్‌ను ఉద్దేశించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘క్రిష్‌కు సినిమా అప్‌డేట్స్‌ ఇవ్వలేదట?’ అని మీడియా ప్రశ్నించగా.. ‘విడుదలకు ముందు డిసెంబరు నెలలో క్రిష్‌కు సినిమా చూపించాలి అనుకున్నాం. కానీ సినిమా పూర్తిగా నాశనం అయిపోయింది, దాన్ని బాగు చేయలేం’ అనే భావనలో ఆయన ఉన్నారు. కానీ నేను సినిమాను పూర్తి చేశా. ఆయనకు చిత్రం నచ్చింది. అప్పటి నుంచి ‘ఇది నా సినిమా’, ‘ఇది నా సినిమా’ అంటున్నారు. ఆయనకు క్రెడిట్‌ ఇచ్చినప్పటికీ మీడియా ముందుకు ఎందుకు వచ్చారు?.. నేరుగా నన్ను కలిసి మాట్లాడి ఉండొచ్చుగా?, ఆయన ఒక్కసారి కూడా నన్ను కలవలేదు. మా ఆహ్వానాలకు ఏ రోజు స్పందించలేదు’ అని కంగన చెప్పారు.

అనంతరం కొందరి పాత్రల్ని కట్‌ చేయడం గురించి మాట్లాడుతూ.. ‘క్యారెక్టర్‌ ఆర్టిస్టులంతా ‘వాళ్లు మాకు ప్రామిస్‌ చేశారు.. కానీ అది జరగలేదు’ అని ఆరోపణలు చేస్తున్నారు. నాకు రహస్యంగా మెసేజ్‌లు చేశారు. ఏవేవో కారణాలు చెబుతున్నారు. అందుకే వారి ఫోన్‌ నెంబర్లు బ్లాక్‌ చేశా. అటు, ఇటు రెండు వైపులా నాటకాలు ఆడుతున్నారా?. నాలాగా, అంకిత, ప్రసూన్‌, శంకర్‌లాగా అంకితభావంతో పనిచేసి ఉంటే సినిమాకు ఎంతో ముఖ్యమైన వారంలో పబ్లిక్‌లోకి వెళ్లి యూనిట్‌ను ఎటాక్ చేయరు. వీరంతా కలిసి సినిమాకు నష్టం కల్గించారు’ అని కంగన పేర్కొన్నారు.

‘సోనూసూద్‌కు ఈ సినిమా గురించి మాట్లాడే హక్కు లేదు. సినిమాతో ఆయనకున్న కాంట్రాక్ట్‌ అయిపోయింది. ఈ సినిమాతో ఆయనకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకు సినిమా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని సోనూసూద్ విషయం గురించి కంగన ప్రశ్నించారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.