
తాజా వార్తలు
హైదరాబాద్: లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించిన సినిమా ‘ఇమైక్క నోడిగల్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘అంజలి సీబీఐ’ టైటిల్‌తో అనువదిస్తున్నారు. ఆర్. అజయ్ జ్ఞానముత్తు ఈ సినిమాను తెరకెక్కించారు. నయనతార ఇందులో సీబీఐ ఆఫీసర్‌గా టైటిల్ రోల్‌ను పోషించారు. ఈ చిత్రంలో అథర్వ, రాశీఖన్నా కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రతినాయకుడిగా కనిపించారు. నయనతార భర్త ‘విక్రమాదిత్య’గా ప్రముఖ హీరో విజయ్ సేతుపతి నటించారు. సీజే జయ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. హిప్హాప్ తమిళన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. ఆర్.డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందించారు.
ఇటీవల తమిళంలో విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో తెలుగునూ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని చిత్ర బృందం పేర్కొంది. విశ్వశాంతి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు సీహెచ్ రాంబాబు, ఆచంట గోపీనాథ్ తెలుగు హక్కుల్ని దక్కించుకున్నారు. ఫిబ్రవరి 22న తెలుగు వెర్షన్‌ను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- పోలీసులపై పూల జల్లు
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ఎన్‌కౌంటర్‌ను నిర్ధారించిన సజ్జనార్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
