
తాజా వార్తలు
హైదరాబాద్: అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఓ సినిమాను నిర్మించనున్నారట. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే ‘100% లవ్’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. కాగా మరోసారి చైతన్య గీతా ఆర్ట్స్ పతాకంలో నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ సినిమాకు ‘గీత గోవిందం’ దర్శకుడు పరుశురాం దర్శకత్వం వహించనున్నారట.
‘నాగచైతన్య గత కొన్ని రోజులుగా పలుమార్లు గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వచ్చారు. కథ గురించి అల్లు అరవింద్‌తో చర్చించడానికి ఆయన వచ్చారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తీయబోతున్నారు. ఇంకా చర్చల దశలోనే ఉంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది’ అని చెబుతున్నారు.
నాగచైతన్య ప్రస్తుతం ‘మజిలీ’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయన భార్యగా సమంత నటిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్ ఆయన ప్రేయసి పాత్రను పోషిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభించింది. మరోపక్క చైతన్య హీరోగా ‘వెంకీ మామ’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో వెంకటేశ్ మరో కథానాయకుడి పాత్ర పోషిస్తున్నారు. కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- ఎన్‌కౌంటర్‌ను నిర్ధారించిన సజ్జనార్
- కొల్లగొట్టింది రూ.100కోట్లకు పైనే!
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
ఎక్కువ మంది చదివినవి (Most Read)
