close

తాజా వార్తలు

చంద్రబాబులా.. రానా మారారిలా..!

మేకింగ్ వీడియోను విడుదల చేసిన చిత్రబృందం

హైదరాబాద్‌: ‘యన్‌టిఆర్‌’ బయోపిక్‌లోని రెండో భాగమైన ‘మహానాయకుడు’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన మేకింగ్‌ వీడియోలను, ప్రోమోలను విడుదల చేస్తూ అభిమానుల్లో అంచనాలను పెంచేస్తోంది. ఇటీవల సినిమాకు సంబంధించిన ఎమోషనల్‌ ప్రోమో పేరిట ఓ వీడియోను విడుదల చేసిన చిత్రబృందం.. తాజాగా సినిమాలో రానా పాత్రకు సంబంధించిన మేకింగ్‌ వీడియోను అభిమానులతో పంచుకుంది.

క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రానా.. ఎన్టీఆర్‌ అల్లుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటించారు. సినిమా కోసం రానా.. చంద్రబాబులా ఎలా మారారు? ఎలాంటి మేకప్‌ వేశారు? తదితర విషయాలను ఈ వీడియోలో చూపించారు. రానా.. చంద్రబాబులా మారడానికి ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు కూడా మేకప్‌ విషయంలో సాయం చేశారు. చంద్రబాబు మేనరిజాన్ని రానా అనుకరిస్తున్నట్లు కనిపించారు. ‘మహానాయకుడు’లో రానా పాత్రే కీలకమని చిత్రబృందం మొదటి నుంచి చెప్తూ వస్తోంది.

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.