close

తాజా వార్తలు

మోహన్‌లాల్‌ది ప్రధానమంత్రి పాత్ర కాదా?

చెన్నై: సూర్య కథానాయకుడిగా కె.వి. ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కప్పాన్‌’. మోహన్‌లాల్‌, ఆర్య, సాయేషా సైగల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలు ఆన్‌లైన్‌ హల్‌చల్‌ చేశాయి. ఈ చిత్రంలో మోహన్‌లాల్‌ ప్రధానమంత్రి పాత్ర పోషిస్తుండగా, ఆర్య ప్రతినాయకుడిగా కనిపించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు మరో ఆసక్తికర విషయం కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ‘కప్పాన్‌’లో ఆర్యనే ప్రధానమంత్రి పాత్ర పోషిస్తుండగా, అతడి తండ్రి పాత్రలో మోహన్‌లాల్‌ కనిపించనున్నారని సమాచారం. అయితే, ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

మరి ప్రధానమంత్రిగా ఎవరి కనిపిస్తారో తెలియాలంటే సినిమా విడుదలయ్యే లేదా కె.వి.ఆనంద్‌ చెప్పేవరకూ వేచి చూడాల్సిందే. హ్యారిస్‌ జైరాజ్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. స్టూడియో గ్రీన్‌ పతాకంపై అల్లిరాజా సుభాష్‌‌కరణ్‌, కేఈ జ్ఞానవేల్‌ రాజాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకొంటున్న ‘కప్పాన్‌’ ఈ ఏడాది దసరాకు విడుదల కానుంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.