close

తాజా వార్తలు

రజనీ, కమల్‌ ఒక్కటి కావాలి: విశాల్‌

చెన్నై: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ కలిసి పోటీ చేయాలని తమిళ స్టార్‌, నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్‌ కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. కమల్‌, రజనీ కలిస్తే తమిళనాడుకు మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ‘రజనీ సర్‌, కమల్‌ సర్‌ కలిసి రావాలని (చేతులు కలపాలని) కోరుకుంటున్నా. నడిగర్‌ సంఘం షో కోసం కాదు.. ఏదో రిసెప్షన్‌ కోసం కాదు..  మల్టీస్టారర్‌ సినిమా కోసం కూడా కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇద్దరు కలిసి పోటీ చేస్తే బాగుంటుంది. అదే జరిగితే ఇక తిరుగు ఉండదు’ అని విశాల్‌ పోస్ట్‌ చేశారు.

రజనీ, కమల్‌ ఇద్దరూ రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కమల్‌ మక్కల్‌‌ నీది మయ్యం‌ అనే పార్టీని స్థాపించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఇటీవల కమల్‌ మీడియా ముందు స్పష్టం చేశారు. రజనీ ఇంకా తన పార్టీ పేరును ప్రకటించలేదు. కానీ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, ఏ పార్టీకి మద్దతు కూడా తెలపనని ఇటీవల రజనీ ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు. ‘రజనీ మక్కల్‌ మండ్రమ్‌’ అనే అభిమాన సంఘం పేరిట తన రాజకీయ కార్యకలాపాలను చేపడుతున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.