close

తాజా వార్తలు

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్’ విడుదల తేదీ ఖరారు

హైదరాబాద్: విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ జీవితంలోని పలు అంశాలను ఆవిష్కరిస్తూ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. జీవీ ఫిల్మ్స్ పతాకంపై రాకేశ్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించిన ఈ సినిమాను మార్చి 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ విషయాన్ని వర్మ ట్విటర్‌ వేదికగా ప్రకటిస్తూ సినిమా పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు గతంలో వర్మ ప్రకటించారు. కాగా.. ఈ సినిమా పంపిణీ హక్కులు ఎవరికీ ఇవ్వలేదని, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాకు సంబంధించి గమనిక.. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్‌ హక్కులు ఎవరెవరో భారీ ఖరీదుకు కొనుక్కున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఎవరు, ఎంతకు కొనుగోలు చేయబోతున్నారన్న వివరాలను నేను, జీవీ ఫిలింస్‌ త్వరలో ప్రకటిస్తాం’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు వర్మ. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు, సినిమాలోని తొలి పాటకు విపరీతమైన స్పందన వచ్చింది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.