close

తాజా వార్తలు

నాగచైతన్య చేతుల మీదుగా ‘ఫ్రైడే పార్టీ’

హైదరాబాద్‌: నటి నిహారిక కొణిదెల ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సూర్యకాంతం’. ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాహుల్‌ విజయ్‌ కథానాయకుడు. కాగా.. ఈ చిత్రంలోని ‘ఫ్రైడే నైట్‌ బేబీ.. పార్టీ నైట్‌ బేబీ..’ అనే పాటను సినీ నటుడు నాగచైతన్య ట్విటర్ వేదికగా విడుదల చేశారు. ఈ పాటలో నిహారిక, రాహుల్‌ చిందులేస్తూ కనిపించారు. నిర్వాణా సినిమాస్‌ బ్యానర్ సినిమాను నిర్మిస్తోంది. నిహారిక సోదరుడు, నటుడు వరుణ్‌ తేజ్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. మార్క్‌ కె రాబిన్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ‘హ్యాపీ వెడ్డింగ్‌’ తర్వాత నిహారిక నటిస్తున్న చిత్రమిది. ఫస్ట్‌లుక్‌తోనే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.