
తాజా వార్తలు
హైదరాబాద్: నటి నిహారిక కొణిదెల ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సూర్యకాంతం’. ప్రణీత్ బ్రహ్మాండపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాహుల్ విజయ్ కథానాయకుడు. కాగా.. ఈ చిత్రంలోని ‘ఫ్రైడే నైట్ బేబీ.. పార్టీ నైట్ బేబీ..’ అనే పాటను సినీ నటుడు నాగచైతన్య ట్విటర్ వేదికగా విడుదల చేశారు. ఈ పాటలో నిహారిక, రాహుల్ చిందులేస్తూ కనిపించారు. నిర్వాణా సినిమాస్ బ్యానర్ సినిమాను నిర్మిస్తోంది. నిహారిక సోదరుడు, నటుడు వరుణ్ తేజ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. మార్క్ కె రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ‘హ్యాపీ వెడ్డింగ్’ తర్వాత నిహారిక నటిస్తున్న చిత్రమిది. ఫస్ట్‌లుక్‌తోనే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- ఆ సంగతి తర్వాత చూద్దాం: రోహిత్
- సంజు శాంసన్ కోసం శశి థరూర్ ఆవేదన
- మంత్రివర్గంలో వారికి చోటిస్తాం: యడియూరప్ప
ఎక్కువ మంది చదివినవి (Most Read)
