close

తాజా వార్తలు

మీకు తెలియని ‘సాహో’ నాయకి..!

‘తీన్‌పత్తి’ సినిమాతో 2010లో బాలీవుడ్‌ తెరకు పరిచయమైంది శ్రద్ధాకపూర్. ‘తుమ్‌ హీ హో’ అంటూ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ‘ఆషికి-2’తో కథానాయికగా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ప్రభాస్‌ సరసన ‘సాహో’తో తెలుగు చిత్ర పరిశ్రమలోకీ ప్రవేశిస్తోంది. ఆదివారం తన 32వ ఏట అడుగుపెట్టబోతోంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ‘బాఘీ’ భామ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..

సాధారణంగా ‘అందం ఉన్న అమ్మాయిలకు తెలివి ఉండదు.. తెలివైన అమ్మాయిలకు అందం ఉండదు’ అని వింటుంటాం. కానీ, శ్రద్ధాకపూర్‌ అందంలోనే కాదండోయ్‌.. చదువులోనూ ఫస్టే. ఆమె ఇంటర్మీడియట్‌లో 95శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది.

శ్రద్ధా కపూర్‌ తల్లిదండ్రులు ఆమెను ఉన్నత చదువులు చదువుకోవాలని సూచించేవారు. కానీ, ఆమె మాత్రం తనకు ఇష్టమైన నటనవైపే మొగ్గు చూపింది.

టీ తాగనిదే ఈ ముంబై సుందరి రోజు ప్రారంభం కాదట. జపనీస్‌ ఫుడ్‌, కప్‌ కేకులంటే విపరీతమైన ఇష్టమట. చాక్లెట్లను చూస్తే నోరూరిపోతుందట.

తండ్రి శక్తికపూర్‌ ప్రముఖ నటుడు. ఆయన నటించిన సినిమాలు ఎక్కువగా చూస్తుంది. ‘అందాజ్‌ అప్నా.. అప్నా’ ఆమెకు ఇష్టమైన సినిమా. తాను సినిమాల్లో రావడానికి తండ్రే స్ఫూర్తి అయినా, అభిమాన నటుడు మాత్రం అమితాబ్‌ బచ్చన్‌ అట.

శ్రద్ధ చిన్న వయసులో ఉన్నప్పుడు తండ్రి శక్తి కపూర్‌ షూటింగ్‌ నుంచి మేకప్‌తో వస్తే.. ఆయనకు ప్రత్యేకమైన శక్తులున్నాయనుకునేదట.

పూర్‌ కుటుంబంలో దాదాపు అందరూ కళాకారులే. శ్రద్ధ వాళ్లమ్మ, అమ్మమ్మ మంచి గాయకులు. శ్రద్ధ.. గాయని కావాలని చిన్న వయసులోనే సంగీత శిక్షణ తీసుకుంది.

బోస్టన్‌ విశ్వవిద్యాలయంలో ఉన్న శ్రద్ధాకపూర్‌ నటనను చూసిన సల్మాన్‌ఖాన్‌ ఆమెకు సినిమా అవకాశం ఇచ్చారట. అప్పుడు శ్రద్ధ వయసు 16 సంవత్సరాలు.

ఫేస్‌బుక్‌ ద్వారా బాలీవుడ్‌లో కథానాయికగా చేసే అవకాశం వచ్చింది. ప్రొఫైల్‌ ఫొటోలు చూసి బాలీవుడ్‌ నిర్మాత అంబిక ‘తీన్‌ పత్తి’లో ఛాన్సిచ్చారు.

మె కేవలం నటనకు మాత్రమే పరిమితం కాలేదు. ‘ఏక్‌ విలన్‌’లో ‘తేరీ గలియా’ అంటూ తొలిసారి పాట పాడింది. ఆ పాటతో 2015లో ఉత్తమ గాయనిగా అవార్డు సాధించింది.  ఆ తర్వాత తాను నటించే ప్రతి సినిమాలోనూ ఓ పాట పాడాలని నియమంగా పెట్టుకుంది. పాడుతూ వస్తోంది. ఆమెకు ఇదొక సెంటిమెంట్‌గా మారిపోయిందని అంటోంది.

అందానికి కారణం మంచి నిద్ర. గాఢ నిద్రతో సౌందర్యం సొంతం అవుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం బాగా నీళ్లు తాగాలి. ఒకవేళ సౌందర్య ఉత్పత్తులు వాడాలనుకుంటే మాత్రం బ్రాండెడ్‌ వాటినే ఎంచుకోవడం మంచిదని సూచిస్తోంది.

ఫిట్‌గా ఉండటానికి జిమ్‌ కంటే ఎక్కువగా డ్యాన్స్‌ చేస్తుంది. దీని వల్ల ఫిట్‌నెస్‌తో పాటూ మనసూ ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి దరిచేరకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడిగితే, ‘ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ బిజీగా ఉండాలి. నేనదే చేస్తా’ అని నవ్వుతూ బదులిస్తుంది. 

సైనా నెహ్వాల్‌ బయోపిక్‌లో నటించేందుకు హైదరాబాద్‌లో కొన్నాళ్లుంది. ఆటతీరును సైనాను అడిగి తెలుసుకుంది. సైనా రూపంలో నాకొక మంచి స్నేహితురాలు దొరికింది అని సంబరపడింది.

ఇంట్లో పంజాబీ, మరాఠీ భాషల్లో ఎక్కువగా మాట్లాడతారు. వీటితో పాటు రష్యన్‌, బ్రిటిష్‌ భాషల్లోనూ మాట్లాడగలదు ఈ ఆషికీ ఆరోహి.

 

వివాదాలకు దూరంగా ఉంటూ, కెరీర్‌ను శ్రద్ధగా తీర్చిదిద్దుకుంటున్న ఆమెను ప్రఖ్యాత ఫోర్బ్స్‌ అత్యంత విజయవంతమైన 30ఏళ్లలోపు ఆసియా యువతిగా గుర్తించి ప్రశంసించింది.  

సాహో సుందరికి యువతలో ఎంతో ఆదరణ. అందుకే సుమారు పది ప్రముఖ కంపెనీలు రా రమ్మని పిలిచి ప్రచార కర్తగా కనిపించే అవకాశాన్నిచ్చాయి. వీట్‌, లిప్టన్‌, డ్యులెక్స్‌, లాక్మే వంటి కాస్మోటిక్‌ వంటి బ్రాండ్లు వాటిలో కొన్ని! 

- ఇంటర్నెట్‌ డెస్క్


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.