close

తాజా వార్తలు

‘సాహో’.. తుపాకీ పట్టిన శ్రద్ధ!

హైదరాబాద్‌: యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘సాహో’ సినిమా నుంచి రెండో వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈరోజు ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని ఈ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో శ్రద్ధా కపూర్‌ గన్ను పట్టుకున్న యాక్షన్‌ సన్నివేశాలను హైలైట్‌ చేశారు. సినిమాలో పోరాట సన్నివేశాలు ఎలా తెరకెక్కిస్తున్నారో చూపించారు. సుజిత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటులు జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ, ఎవ్లిన్‌ శర్మ, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కిస్తోంది. ఈ ఏడాది చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.