close

తాజా వార్తలు

ఉండిపోరాదే.. గుండె నీదేలే!

యువతను మెప్పించిన టాప్‌ సాంగ్స్‌ ఇవే!

అక్షరాలు కలిస్తే పదం.. పదాలు కలిస్తే పాట..
ఆ పాటకు సంగీతం తోడైతే మది ఆడుతుంది ఆట.
కొన్ని పాటలు వినసొంపుగా ఉంటాయి..
ఇంకొన్ని చిందులేయిస్తాయి..
మరికొన్ని మదిలోని జ్ఞాపకాలను తట్టిలేపుతాయి.
మనసును మురిపించి.. పెదాలపై పలికించి.. మనల్ని దాంతో పాటూ నడిపించే శక్తి పాటకు ఉంది.

అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ అలాంటి పాటలు వస్తూనే ఉంటాయి. పాటలకు భాషతో సంబంధం లేదు.. అందుకే ‘కొలవెరి’ ప్రపంచాన్ని వెర్రెక్కించింది.. ‘చంద్రముఖి’ లకలకలాడించింది.. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ఇటీవల కొన్ని పాటలు యువతను విశేషంగా అలరిస్తున్నాయి. అలాంటి వాటిలో కొన్ని మీకోసం..

యువత ‘హుషారె’త్తిపోతున్నారు!

కాలర్‌టోన్‌, రింగ్‌టోన్‌, ఎఫ్‌ఎం రేడియో, యూట్యూబ్‌ వేదిక ఏదైనా ఇప్పుడు యువత హమ్‌ చేస్తున్న పాట ఒక్కటే.. ‘ఉండి పోరాదే.. గుండె నీదేలే! హత్తుకోరాదే.. గుండెకేనన్నే..’. యువ దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో వచ్చిన ‘హుషారు’ సినిమాలోనిదీ పాట. డిసెంబరులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకున్నా, ఈ పాట మాత్రం యువ హృదయాల బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేసింది.


చిందులేయిస్తున్న ‘రౌడీబేబి’

కప్పుడు ధనుష్‌ ఆలపించిన ‘వై దిస్‌ కొలవెరి’ ప్రపంచ సరిహద్దులను చెరిపేసింది. చాలా రోజుల తర్వాత మరోసారి ఆయన చిత్రంలోని పాట యువతను ఊపేస్తోంది. ధనుష్‌, సాయిపల్లవి జంటగా బాలాజీ మోహన్‌ తెరకెక్కించిన చిత్రం ‘మారి2’. తెలుగులోనూ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయలేకపోయింది. అయితేనేం.. తమిళ, తెలుగు భాషల్లో ‘రౌడీ బేబి’ సాంగ్‌ తెగ అలరించేస్తోంది. 


కోరుకున్న ప్రేయసి.. దూరమైన ఊర్వశి..

తేడాది యువ హృదయాలనే కాదు.. బాక్సాఫీస్‌ వద్ద కాసులను కొల్లగొట్టేసిన చిత్రం ‘ఆర్‌ ఎక్స్‌ 100’. ‘కోరుకున్న ప్రేయసివే.. దూరమైన ఊర్వశివే.. సరసకు రా.. ఎలా విడిచి బతకనే పిల్లారా..’ అంటూ విరహ ప్రేమికుడి గాథను అందంగా చూపించారు అజయ్‌ భూపతి. భగ్న ప్రేమికుడిగా కార్తికేయ నటన.. ప్రేమను చిన్న చూపు చూసే కథానాయికగా పాయల్‌ రాజ్‌పుత్‌ అభినయం అదరహో!


 

సలాం చేయించుకుంటున్న రాఖీభాయ్‌

‘ముంబయి తేరే బాప్‌కా హై’ అంటే ‘నై రే, తేరా బాపా కా హై.. ఔర్‌ తేరా బాప్‌ మై హూ..’ అంటూ బాక్సాఫీస్‌ వద్ద దడదడలాడించేశాడు కన్నడ నటుడు యశ్‌. ఆయన నటించిన ‘కేజీఎఫ్‌’లోని పరిచయ పాట  ‘సలాం రాఖీభాయ్‌’ యువతను విశేషంగా మెప్పిస్తోంది. ఒక కన్నడ సినిమాగా ప్రారంభమైన ‘కేజీఎఫ్‌’ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.


 

ఎవర్‌గ్రీన్‌ గీత గోవిందం!

2018 ఇయర్‌ ఆఫ్‌ ద సాంగ్‌గా చెప్పాలంటే ‘గీత గోవిందం’లోని ‘ఇంకేం.. ఇంకే.. ఇంకే కావాలే’ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే.. అంతలా అలరించిందా పాట. విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మ్యూజికల్‌గానూ మెప్పించింది. ‘ఇంకేం.. ఇంకేం’ పాట యువతను ఉర్రూతలూగించేసింది. 


ఆ వెంటనే ట్యాక్సీవాలా... 

‘ఇంకేం.. ఇంకేం.. ఇంకే కావాలే’ పాట ఒక్కటే ఏం సరిపోతుంది.. ఇదిగో ఈ పాట కూడా పాడుకోండి అంటూ యువత మెచ్చే మరో పాట తన చిత్రంతో ఇచ్చాడు విజయ్‌ దేవరకొండ. ఇందులోని ‘మాటే వినదుగా.. మాటే వినదుగా’ పాట యువతలో క్రేజ్‌ సంపాదించుకుంది.  యువ దర్శకుడు రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో విజయ్‌-ప్రియాంక జవాల్కర్‌ జోడీగా నటించిన ‘ట్యాక్సీవాలా’ భయపెడుతూ నవ్వించింది.


గుండెలు పిండేసిన ఎన్టీఆర్‌..

మెలోడి, ఫాస్ట్‌బీట్‌లే కాదు, గుండెలను పిండేసే విషాద గీతాలూ మాకు నచ్చుతాయని ‘పెనివిటి’ సాంగ్‌తో నిరూపించారు యువత. ఎప్పుడూ తనదైన స్టెప్స్‌తో యువతను కిర్రెక్కించే ఎన్టీఆర్‌ ఈసారి ఆ పాటతో గుండెలను పిండేశారు. ‘పెనివిటి ఎన్ని నాళ్లయినాదో నిను చూసి కళ్లారా’ అంటూ తెరపై ఎన్టీఆర్‌ పాడుతుంటే చూస్తున్న వాళ్ల కళ్లలో కూడా నీళ్లు తిరిగాయంటే అతిశయోక్తి కాదు. ఎన్టీఆర్‌-పూజాహెగ్డే నాయక నాయికలుగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అరవింద సమేత’లోని ఈ పాట యువతను మెప్పించింది.


 

మళ్లీ మేజిక్‌ చేసిన సాయిపల్లవి!

యువతలో సాయిపల్లవికి ఉన్న క్రేజే వేరు. తన అందచందాలతో ‘ఫిదా’తో చేసిన ఈ తమిళ పొన్ను.. ఈ ఏడాది  ‘పడి పడి లేచె మనసు’తో మరోసారి మేజిక్‌ చేసింది. హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్‌-సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రం ఈఏడాది సంక్రాంతికి విడుదలై మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. ఇందులో ‘ఓ మై లవ్లీ లలన’ సాంగ్‌తో సాయిపల్లవి కట్టిపడేసింది.

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.