close

తాజా వార్తలు

చై, సామ్‌లను మెప్పించిన జంట వీరే!

హైదరాబాద్‌: పెళ్లయ్యాక నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇటీవల చిత్రీకరణ పూర్తిచేసుకుంది. కాగా.. ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా సమంత, నాగచైతన్య అభిమానులకు ఓ టాస్క్‌ ఇచ్చారు. సినిమాలోని తమ పోస్టర్‌ను షేర్‌ చేస్తూ.. ‘ఈ పోస్టర్‌ను డిజైన్‌ చేస్తున్నప్పుడు మేం చాలా ఎంజాయ్‌ చేశాం. మీరు కూడా మీ జీవిత భాగస్వాములతో కలిసి ఇలాంటి పోస్టర్‌నే డిజైన్‌ చేయండి. ఈ టాస్క్‌లో ఎవరి పోస్టర్‌ మమ్మల్ని మెప్పిస్తుందో వారికి ఫన్నీ సర్‌ప్రైజ్‌ ఇస్తాం’ అని పేర్కొన్నారు.

అయితే ఈ టాస్క్‌లో ప్రశాంత్‌ అనే వ్యక్తి గెలిచారు. తన భార్యతో కలిసి ‘మజిలీ’ పోస్టర్‌ను డిజైన్‌ చేసి నాగచైతన్య, సమంతలకు ట్యాగ్‌ చేశారు. పోస్టర్‌ పర్‌ఫెక్ట్‌గా ఉందంటూ చై, సామ్‌ ఆ జంటను అభినందించారు. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్‌ మరో కథానాయికగా నటించారు. సినిమాలో నాగచైతన్య పూర్ణ పాత్రలో సమంత శ్రావణి పాత్రల్లో కనిపిస్తారు. సమంత పాత్ర ఓ వైపు నవ్విస్తూనే మరో వైపు ఏడిపిస్తుందని చిత్రబృందం వెల్లడించింది. రావు రమేశ్‌, సుబ్బరాజు, పోసాని కృష్ణ మురలి కీలక పాత్రలు పోషించారు. గోపీ సుందర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.