close

తాజా వార్తలు

ఇది మా అదృష్టం: ఎన్టీఆర్‌ 

హైదరాబాద్‌: తన కెరీర్‌లో ఇదో ఉత్తమ చిత్రం అవుతుందని ఎన్టీఆర్‌ అన్నారు. రామ్‌చరణ్‌తో కలిసి ఆయన నటిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(వర్కింగ్‌ టైటిల్‌) రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. అలియా భట్‌, సముద్రఖని, అజయ్‌దేవగణ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం రామ్‌చరణ్‌, రాజమౌళి, నిర్మాత దానయ్యలతో కలిసి ఎన్టీఆర్‌ విలేకరులతో మాట్లాడారు. 

‘‘ఈరోజు చాలా టెన్షన్‌గా ఉంది. ఇది జక్కన్నతో నాలుగో చిత్రం నాది. అన్నింటికంటే ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఫీలవుతున్నాను. నా కెరీర్‌లో ల్యాండ్‌మార్క్‌గా మిగిలిపోతుంది, ఎందుకంటే జక్కన్నతో పనిచేయడం దాంతో పాటు చరణ్‌తో కలిసి తెరపంచుకోబోతున్నాను. మా ఇద్దరి స్నేహం ఈ సినిమాతో మొదలవ్వలేదు. నాకు తెలిసిన మంచి మిత్రుడు. నా కష్ట సుఖాలు పంచుకునే మిత్రుడు చరణ్‌. ఈ సినిమా మేం కలిసి చేసేసరికి వేరే లెవల్‌కు వెళ్లిపోయింది మా స్నేహం. మేమిద్దరం ఎప్పటికీ ఇలాగే స్నేహితులుగా మిగిలిపోవాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను. మాకు ఎలాంటి దిష్టి తగలకూడదు. అల్లూరి, భీం గురించి తెలిసిన గీత ఒకటి ఉంది. ఇప్పుడు వారిద్దరూ మనకు తెలీని గీత గురించి ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో చూస్తారు. ఈ సినిమా నాకు, చరణ్‌కు నటులుగా ఎదగడానికి ఎంతో దోహదపడుతుంది. ఈ సినిమా ప్రారంభించడానికి ముందు మేం చేసిన వర్క్‌ షాప్స్‌, శిక్షణ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు చేసిన 28 సినిమాల కంటే ఈ సినిమా కోసం తీసుకున్న శిక్షణ మా భవిష్యత్‌ సినిమాలకు ఎంతో సహాయపడుతుందని చెప్పగలను. మేం తీసుకున్న శిక్షణ వర్ణనాతీతం. రాజమౌళి బుర్రలో పుట్టిన ఈ ఆలోచన ఓ గొప్ప చిత్రంగా ఉంటుందని నా ప్రగాఢ విశ్వాసం. నటులుగా ఈ చిత్రంలో మేం పాల్గొనడం మా అదృష్టం. ఈ అవకాశం ఇచ్చినందుకు జక్కన్నకు ధన్యవాదాలు. ఈ సినిమాలో ఆయన అడిగిన వెంటనే నాతో ఏకీభవించి ఒక్క క్షణం  కూడా ఆలోచించకుండా ఎటువంటి విభేదాలూ లేకుండా చరణ్‌ ఒప్పుకొన్నందుకు హ్యట్సాఫ్‌ చెప్పాలి. మా తరంలో ఈ సినిమా రాబోతోందని చాలా సంతోషంగా ఉంది. అది కేవలం జక్కన్నపై మాకున్న కాన్ఫిడెన్స్‌ వల్లే అవబోతోంది’’ అని అన్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.