
తాజా వార్తలు
అప్పటివరకు ఆగాల్సిందే: అరుణ్ విజయ్
హైదరాబాద్: భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘సాహో’ సినిమాలో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తైందని అంటున్నారు ప్రముఖ తమిళ నటుడు అరుణ్ విజయ్. యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న చిత్రమిది. దాదాపు రెండేళ్ల నుంచి చిత్రీకరణ జరుగుతోంది. కాగా.. ఈ సినిమాలో తన పాత్ర పూర్తైందని అరుణ్ విజయ్ ట్విటర్ వేదికగా ప్రకటించడంతో సినిమా చిత్రీకరణ విషయంపై అభిమానులకు కాస్త స్పష్టత వచ్చినట్లైంది. ‘ ‘సాహో’లో నా పాత్ర పూర్తైంది. ఈ అద్భుతమైన టీంతో కలిసి పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా నాకు తీపి జ్ఞాపకంలా మిగిలిపోయేలా చేసినందుకు ప్రభాస్‌కు, దర్శకుడు సుజీత్‌కు, యూవీ క్రియేషన్స్‌కు, మిగతా చిత్రబృందానికి ధన్యవాదాలు. ఈ ప్రతిష్ఠాత్మక సినిమాను థియేటర్లలో చూసేందుకు ఆగస్ట్ 15 వరకు ఆగాల్సిందే.’ అని పేర్కొంటూ సెట్లో కేక్ కట్ చేస్తున్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో బాలీవుడ్ నటులు మందిరా బేడీ, ఎవ్లిన్ శర్మ, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేశ్‌లు కూడా నటిస్తున్నారు. కేవలం మూడు పాటలు, మరికొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ మాత్రమే మిగిలుంది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- టీమిండియా సమష్టి విజయం
- బంపర్ ఆఫర్ కొట్టేసిన షాలినీ పాండే
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- 2019లో గూగుల్‌లో అధికంగా సెర్చ్ చేసినవివే..
- పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
