close

తాజా వార్తలు

సాయిధరమ్‌.. ‘పరుగు పరుగు..’!

‘చిత్రలహరి’ తొలి పాట విన్నారా

హైదరాబాద్‌: యువ కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌ నటిస్తున్న చిత్రం ‘చిత్రలహరి’. ‘హలో’ ఫేం కల్యాణి ప్రియదర్శన్‌ కథానాయిక. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభించింది. కేవలం 24 గంటల్లోనే దాదాపు 3.5 మిలియన్ల మంది టీజర్‌ను చూశారు. ఈ సందర్భంగా సాయిధరమ్ ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూ ఆనందం వ్యక్తం చేశారు.
కాగా ఈ సినిమాలోని మొదటి పాటను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ‘పరుగు పరుగు..’ అని సాగే ఈ పాటను డేవిడ్‌ సైమన్‌ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి స్పందన లభిస్తోంది. ఇటీవల ‘చిత్రలహరి’ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ఈ సినిమాలో నటించే అవకాశం తనకు రావడం అదృష్టమని సాయిధరమ్‌ ట్వీట్‌ చేశారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.