close

తాజా వార్తలు

విడుదలకు ముందే రూ.50 కోట్ల లాభం

చెన్నై: తమిళ కథానాయకుడు విజయ్‌ 63వ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. నయనతార కథానాయిక. ఈ సినిమా టైటిల్‌ను కూడా ఇంకా ప్రకటించలేదు. కాగా చిత్రం శాటిలైట్‌, డిజిటల్‌ హక్కులకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. రూ.50 కోట్లతో ఓ ప్రముఖ ఛానల్‌ తమిళ హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ఇంకా టైటిల్‌ కూడా ప్రకటించకముందే కేవలం ఓ భాషలో హక్కులు ఇంత మొత్తానికి అమ్ముడుపోవడం రికార్డని విమర్శకులు అంటున్నారు.
ఈ సినిమాకు ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. వివేక్‌, యోగిబాబు, డేనియల్‌ బాలాజీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం సెట్‌లో తీసిన కొన్ని వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో విజయ్‌ ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపించనున్నట్లు సమాచారం. విజయ్‌, నయన్‌ కాంబినేషన్‌లో వస్తోన్న రెండో సినిమా ఇది. వీరిద్దరు గతంలో ‘విల్లు’ సినిమా కోసం కలిసి పనిచేశారు. విజయ్‌, అట్లీ కాంబినేషన్‌లో ఇప్పటికే బ్లాక్‌బస్టర్స్‌ ‘తెరి’, ‘మెర్సల్‌’ వచ్చాయి. దీంతో ఈ మూడో ప్రాజెక్టుపై క్రేజ్‌ ఏర్పడింది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.