close

తాజా వార్తలు

ఘనంగా వెంకటేశ్‌ కుమార్తె వివాహం

హాజరై సందడి చేసిన సినీ ప్రముఖులు

జయపుర: విక్టరీ వెంకటేశ్‌ కుమార్తె ఆశ్రిత వివాహం ఆదివారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్‌ రాజధాని జయపురలోని ఓ హోటల్‌లో ఆశ్రిత, హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ ఛైర్మన్‌ సురేందర్‌ రెడ్డి మనవడు వినాయక్‌ రెడ్డిని వివాహం చేసుకున్నారు. వేడుకకు రామ్‌చరణ్‌, ఉపాసన, నాగచైతన్య, సమంత, సల్మాన్‌ ఖాన్‌ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి జయపురలో ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో సమంత, నాగచైతన్య, రానా తదితరులు నృత్య ప్రదర్శన ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 6న ఆశ్రిత, వినాయక్‌ల నిశ్చితార్థం జరిగిందట. కొన్నేళ్లుగా  వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.