
తాజా వార్తలు
బీజింగ్: సోషల్ మీడియాలో యువత ఎంత చురుగ్గా ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ, దాని మత్తులో పడి ఎంతో మంది విద్యార్థులు చదువులో వెనుకబడి పోతున్నారని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సర్వేలు వెల్లడించాయి. సోషల్‌మీడియాలో మునిగి తమ పిల్లలు పాడైపోతున్నారని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే పాఠశాలల్లో.. కళాశాలల్లో మొబైల్ఫోన్లు, సోషల్ నెట్వర్క్ వినియోగానికి అనుమతి ఉండదు. వాటి గురించి ఎక్కువ చర్చలు ఉండవు. అయితే కొద్ది రోజుల క్రితం ఓ ప్రొఫెసర్ తన విద్యార్థులకు ‘సోషల్‌మీడియా’పై ఇచ్చిన అసైన్మెంట్ చర్చనీయాంశంగా మారింది.
చైనాలోని హనెన్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ లాలో ఆన్లైన్ అండ్ న్యూ మీడియా కోర్సును నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు వర్సిటీ ప్రొఫెసర్ వింత అసైన్మెంట్ ఇచ్చారు. అదేంటంటే.. ప్రతీ విద్యార్థి వీ చాట్ (చైనాలో ప్రముఖ సోషల్ కమ్యూనిటీ నెట్వర్క్)లో ఎంత ఎక్కువ మందిని మిత్రులుగా చేసుకుంటే.. అన్ని మార్కులు వేస్తానని చెప్పారు. కనీసం 1,001 మందిని మిత్రులుగా చేసుకుంటే 100కు 60 మార్కులు, 1,667 మందిని మిత్రులుగా చేసుకుంటే A+ గ్రేడ్ ఇస్తానని తెలిపారు. అయితే ఆన్‌లైన్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఉత్సాహంగా తమకిచ్చిన పనిని పూర్తి చేస్తుంటే.. సోషల్ మీడియాపై ఆసక్తి లేని విద్యార్థులు 100 మందిని కూడా మిత్రులుగా చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం బయటకు తెలియడంతో తల్లిదండ్రులు, సామాజిక వేత్తలు ప్రొఫెసర్‌పై మండిపడుతున్నారు. అయితే యూనివర్సిటీ మాత్రం ప్రొఫెసర్‌ను వెనకేసుకొస్తోంది. ఆన్లైన్ కోర్సులో ఇదీ ఒక భాగమేనని అంటోంది. విద్యార్థులకు సోషల్‌మీడియా, వాస్తవిక పరిస్థితులపై అవగాహన కల్పించేందుకే ఈ అసైన్మెంట్ ఇచ్చారని చెబుతోంది. ఇది నిజంగా విద్యార్థుల భవిష్యత్తుకు ఎంత మేర ఉపయోగపడుతుందో తెలియని కానీ.. ప్రస్తుతం వారంతా సోషల్‌మీడియాలో మిత్రుల కోసం అన్వేషిస్తున్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- వదిలేశారు..
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
