close

తాజా వార్తలు

ఇది భిన్నమైన ప్రచారం!

పశ్చిమబంగాలో పాత ప్రచార పద్ధతిగా గోడ రాతలకు గుర్తింపు

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఎన్నికల ప్రచారంలో హామీలు గుప్పిస్తేనో, జనాన్ని మభ్యపెట్టాలని చూస్తేనో ఓట్లు పడే పరిస్థితి ఇప్పుడు లేదు.  ఓటర్లను ఆకట్టుకోవాలంటే గతంలో మాదిరిగా రాజకీయ నేతలు కేవలం బహిరంగ సభలు, సాధారణ ప్రచారాలపైన ఆధారపడితే సరిపోదు. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించాలి. ప్రత్యర్థిని దాటి ముందుకు దూసుకుపోవాలంటే ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి.  ప్రస్తుత ఎన్నికల్లో పలు పార్టీలు అదే పనిలో ఉన్నాయి.  ప్రచార రథాలను తయారు చేస్తూ, నగరమంతా పోస్టర్లతో నింపేయడం, టీషర్ట్‌లు, టోపీలు, మాస్క్‌లతోపాటు టీ కప్పులపైనా తమ పార్టీ గుర్తులను ముద్రించి ప్రచారాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నారు.  

పశ్చిమ బంగాల్‌లో ఇప్పటికీ పాత ప్రచార పద్ధతి అయిన గోడరాతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో గోడరాతలు హాస్యకవితలదే సింహభాగం. సాహిత్య ప్రియులు అధికంగా ఉండే బంగాల్‌లోని గోడలు చాలా వరకు ప్రత్యర్థి పార్టీలపై వ్యంగ్య కవితలతో కూడిన రాతలు, కార్టూన్లతో నిండిపోయాయి. ప్రత్యర్థి పార్టీల హామీలు, అభ్యర్థులపై పంచ్‌లైన్లతో కూడిన కార్టూన్లు బంగాల్‌ ఎన్నికల ప్రచారంలో భాగమని అక్కడ నాయకులు భావిస్తుంటారు. సోషల్‌మీడియాతో పొల్చితే అత్యంత చౌక అయిన ప్రచార పద్ధతిగా దీన్ని పేర్కొంటారు.  దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి ఈ తరహా ప్రచారం బంగాల్‌లో ఉంది.కాలం గడుస్తున్న కొలది ప్రచార తీరులో మార్పు వచ్చినా ఈ గోడ రాతల ప్రచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ గోడ రాతల్లో కొన్ని వ్యంగ్యంగా ఉండి నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆలోచింపజేసేలా ఉంటాయి. సోషల్‌మీడియాలో భారీ స్థాయిలో ప్రచారం చేయగలుగుతున్నప్పటికీ ఒక ప్రదేశంలో స్థానికులను కట్టి పడేసే సామర్థ్యం హాస్య కవితలే ఉందంటున్నారు బంగాల్‌ రాజకీయ నేతలు.

ప్రచారంలో భాగంగా బహిరంగ సభలు నిర్వహిస్తూ ఉంటారు. దీని కోసం  జనసమీకరణ కూడా చేస్తుంటారు. అలాంటి సమావేశాలకు తరలివచ్చే జనాలను ఆకట్టుకోవడానికి పార్టీల మద్దతుదారులు చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. వాటిలో మాస్క్‌లు ధరించడం, అభిమాన నాయకుల వేషధారణలో ప్రజలను ఆకట్టుకుంటారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో భాజపా ‘మై బీ చౌకీదార్‌’ నినాదాన్ని అస్త్రంగా ఎంచుకుంది. ఆ నినాదాన్ని ప్రచారంలో భాగంగా అధికంగా వాడుకుంటున్నారు. పలు ప్రదేశాల్లో ఫొటోపాయింట్లను ఏర్పాటు చేసి అక్కడ మైబీ చౌకీదార్‌ అనే ఫ్రేమ్‌ వెనుక నిలబడి ఫొటోలు తీయించుకుంటున్నారు. నమో ఎగైన్‌ అనే నినాదాన్ని రాసి ఉన్న టీ కప్పులను అమ్ముతున్నారు. మరో వైపు ప్రచారం ఊపందుకోవడంతో ప్రచార సామగ్రి తయారు చేసే దుకాణాల్లో సందడి నెలకొంది. వేర్వేరు రాజకీయ పార్టీల జెండాలు, గుర్తులు, ఇతర ప్రచార సామగ్రితో దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఈ సారి ఎన్నికలకు భారీ ఎత్తున టీషర్ట్‌లు, పార్టీల కండువాలు, జెండాలు, రాజకీయ నాయకుల మాస్క్‌లు తయారు చేస్తున్నారు. చిరకాల ప్రత్యర్థుల ఫొటోలు,  పార్టీల కండువాలు ఒకేచోట కొలువుదీరి ఉంటున్నాయి.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.