close

తాజా వార్తలు

దీపికకు యాసిడ్‌ బాధితురాలి కానుక

ముంబయి: యాసిడ్‌ బాధితురాలు మనీషా ప్రజాపతి బాలీవుడ్‌ కథానాయిక దీపికా పదుకొణె కోసం ప్రత్యేకమైన స్కెచ్‌ వేశారు. ‘ఛపాక్‌’లో  దీపిక లుక్‌ను ఆమె చేతితో గీశారు. ఈ సందర్భంగా మనీషా స్కెచ్‌తో కలిసి దిగిన ఫొటోను సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూ.. ‘నాకు కలర్‌ స్కెచ్‌తో బొమ్మలు వేయడం సరిగా రాదు. కానీ ప్రయత్నించాను. ‘ఛపాక్‌’ చిత్ర బృందానికి ఈ స్కెచ్‌ నచ్చుతుందని అనుకుంటున్నా. సినిమా చక్కటి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా’ అని పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్‌కు అభిమానులు దీపికను ట్యాగ్‌ చేశారు. మరి నటి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
‘రాజీ’ ఫేం మేఘనా గుల్జార్‌ ‘ఛపాక్‌’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 15 ఏళ్ల వయసులో యాసిడ్‌ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్‌ అనే మహిళ జీవితం ఆధారంగా ఈ సినిమాను తీస్తున్నారు. విక్రాంత్‌ మస్సే ఇందులో అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 10న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.