close

తాజా వార్తలు

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ప్రివ్యూను చూడలేం: హైకోర్టు

అమరావతి: ఎన్నో వివాదాల మధ్య మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విడుదల కాలేదు. ఏపీలో సినిమా విడుదల అంశమై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసును ఈనెల 9వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే సినిమాకి సంబంధించిన ఒక పిటిషన్ సుప్రీం కోర్టులో పెండింగ్ ఉన్నందున తాము ఈ కేసు విచారణ చేయకూడదని హైకోర్టు తెలిపింది. 

ఏప్రిల్‌ 3న ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ప్రివ్యూ చూసి నిర్ణయం తీసుకుంటామని గతంలో హైకోర్టు పేర్కొనగా, ఈ రోజు ఆ చిత్ర నిర్మాత రాకేష్‌రెడ్డి సినిమా కాపీని తీసుకుని కోర్టుకు వచ్చారు. అయితే సుప్రీం కోర్టులో పిటిషన్ ఉన్నందున తాము ప్రివ్యూ చూడటం సరికాదని కేసును 9వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి స్పష్టం చేశారు. 

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.