close

తాజా వార్తలు

నాగ్‌తో నయన?

‘బాస్‌’, ‘గ్రీకువీరుడు’... నాగార్జున, నయనతార కలసి నటించిన చిత్రాలివి. వీరిద్దరూ ముచ్చటగా మూడోసారి కలసి నటించబోతున్నట్టు సమాచారం. నాగార్జున కథానాయకుడిగా నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయిన’ మంచి విజయం అందుకుంది. కల్యాణ్‌ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. దానికి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ఇందులో కథానాయికగా నయనతార పేరు పరిశీలిస్తున్నారు. చిరంజీవి ‘సైరా’లో నయన కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె చేతిలో మరో తెలుగు సినిమా చేరినట్టే. అన్నీ కుదిరితే.. నాగ్‌ - నయన జోడీ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయం. ప్రస్తుతం నాగార్జున ‘మన్మథుడు 2’తో బిజీగా ఉన్నారు. ఆ వెంటనే  ‘బంగార్రాజు’ సెట్స్‌పైకి వెళ్తుంది. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నాగార్జున భావిస్తున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.