close

తాజా వార్తలు

కొత్త అవతారం ఎత్తిన వర్మ

సినీ కెరీర్‌లోనే తొలిసారి..

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కొత్త అవతారం ఎత్తారు. ఇన్నాళ్లూ దర్శకుడిగా మెప్పించిన ఆయన, నటుడిగానూ ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం వర్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమా ‘కోబ్రా’ను ప్రకటించారు. గన్‌షాట్‌ ఫిల్మ్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. ఈ సినిమా కోసం వర్మ తన సినీ జీవితంలోనే తొలిసారి నటిస్తున్నారు. ఇది గన్‌షాట్‌ ఫిల్మ్స్‌ సంస్థ నుంచి వస్తోన్న తొలి సినిమా కావడం విశేషం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలన్ని ప్రకటిస్తామని నిర్మాతలు పేర్కొన్నారు.
తన పుట్టినరోజు సందర్భంగా వర్మ ఓ ట్వీట్‌ చేశారు. కేక్‌ ముందున్న ఫొటో షేర్‌ చేస్తూ.. ‘నా వయసు మరో సంవత్సరం పెరిగింది’ అంటూ 
ఏడుస్తున్న ఎమోజీని పోస్ట్‌  చేశారు. వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా ఇటీవల విడుదలైంది. ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతి జీవితాల ఆధారంగా రూపొందించిన ఈ సినిమా అనేక వివాదాలు ఎదుర్కొంది. తెలంగాణలో విడుదలైంది కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా విడుదల కాలేదు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.