
తాజా వార్తలు
ప్రపంచ వ్యాప్తంగా రూ.21 కోట్లు..!
హైదరాబాద్: నాగచైతన్య, సమంత జంటగా నటించిన ‘మజిలీ’ సినిమా అమెరికాలో అర్ధ మిలియన్ డాలర్ల మార్కు దాటింది. ఈ విషయాన్ని సినీ విశ్లేషకులు సోషల్మీడియా వేదికగా తెలిపారు. సినిమా శనివారం అక్కడ 132 లొకేషన్లలో 197,273 డాలర్లు రాబట్టినట్లు పేర్కొన్నారు. శుక్రవారం, శనివారంతో కలిపి మొత్తం 509,572 డాలర్లు వసూలు చేసినట్లు చెప్పారు. త్వరలోనే మిలియన్ డాలర్ల మార్కును చేరుకోనున్నట్లు అంచనా వేశారు. తొలిరోజున ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.7 కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండు రోజుల్లో రూ.21 కోట్లు వసూలు చేసినట్లు సినీ విశ్లేషకులు తెలిపారు.
శివ నిర్వాణ ‘మజిలీ’ సినిమాకు దర్శకత్వం వహించారు. దివ్యాన్ష కౌశిక్ మరో కథానాయిక. షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ బాణీలు అందించారు. తమన్ నేపథ్య సంగీతం సమకూర్చారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి విశేషమైన స్పందన లభించింది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- ఆలియా మెచ్చిన తెలుగు హీరో..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
