close

తాజా వార్తలు

సూర్య కొత్త చిత్రం షురూ

చెన్నై: మాధవన్‌ నటించిన ‘ఇరుది సుట్రు’ చిత్రంతో తన ప్రత్యేకతను చాటుకున్న దర్శకురాలు సుధ కొంగరా. ప్రస్తుతం సూర్య నటిస్తున్న 38వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూజ కార్యక్రమం చెన్నైలో జరిగింది. సీక్యా ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రాజశేఖర్‌ కర్పూర సుందరపాండియన్‌ సహ నిర్మాత. సూర్యకు జోడీగా అపర్ణ బాలమురళీ నటిస్తోంది. జీవీ ప్రకాశ్‌ సంగీతం సమకూర్చుతున్నారు. నికేత్‌ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి జాకి సంగీతం అందిస్తున్నారు. ఈ పూజ కార్యక్రమంలో శివకుమార్‌, సూర్య, నటుడు కార్తి, అపర్ణ, సుధ, జీవీ ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి చిత్రీకరణ మొదలు కానుంది. 
 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.