
తాజా వార్తలు
హైదరాబాద్: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన జపాన్ అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ కథానాయిక. కాగా.. ఈ సినిమాను జపాన్‌లోనూ విడుదల చేయనున్నట్లు ఫిలిం వర్గాలు అంటున్నాయి. ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ సినిమాకు జపాన్ ప్రేక్షకులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. సొంత భాషలో విడుదలయ్యే సినిమాలకంటే ఎక్కువగా వారు ‘బాహుబలి’ని ఆదరించారు. అందుకు కృతజ్ఞతగా ప్రభాస్ జపాన్ కొత్త సంవత్సరం సందర్భంగా అభిమానులకు కానుకలు పంపించారు. కాగా.. ‘సాహో’ సినిమాను కూడా జపాన్‌లో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకుందట.
త్వరలో డబ్బింగ్ ప్రక్రియ కూడా మొదలుకానున్నట్లు తెలుస్తోంది. సినిమా ప్రచార కార్యక్రమాల నిమిత్తం ప్రభాస్ జపాన్‌కు కూడా వెళతారని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణ రెడ్డి, విక్రమ్ రెడ్డి, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేశ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, ఎవ్లిన్ శర్మ, అరుణ్ విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శంకర్, ఎహసాన్, లాయ్ త్రయం సినిమాకు సంగీతం అందిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 15న ‘సాహో’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- ఎన్‌కౌంటర్‌ను నిర్ధారించిన సజ్జనార్
- కొల్లగొట్టింది రూ.100కోట్లకు పైనే!
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
ఎక్కువ మంది చదివినవి (Most Read)
