
తాజా వార్తలు
నా స్థలంలోకి నన్ను రానివ్వకుండా..
హైదరాబాద్: ‘హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కోర్టు చెక్‌బౌన్స్ కేసు తీర్చు ఇచ్చిన తర్వాత న్యాయస్థానాన్ని నేను తప్పుదోవ పట్టించానని మోహన్‌బాబు పత్రికా ప్రకటనలో పేర్కొనడం దిగ్భ్రాంతికి గురి చేసింది’ అని దర్శకుడు వైవీఎస్ చౌదరి పేర్కొన్నారు. ఇప్పుడు తన స్థలంలోకి తను వెళ్లకుండా మోహన్‌బాబు అడ్డుకుంటున్నారని, ఈ మేరకు ఆయనకు లీగల్ నోటీసు పంపానని అన్నారు. దీనిపై వైవీఎస్ చౌదరి ఓ ప్రకటన విడుదల చేశారు.
‘శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్‌బాబు నిర్మించిన ‘సలీమ్’ (2009) సినిమాకు నేను దర్శకత్వం వహించా. నా పారితోషికం నిమిత్తం మోహన్ బాబు నాకు బాకీపడ్డ రూ. 40,50,000 చెక్ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా దాదాపు 9 సంవత్సరాల తర్వాత నాకు అనుకూలంగా తీర్పు వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తీర్పు వెలువడిన తదనంతరం సదరు న్యాయస్థానాన్ని నేను తప్పుదోవ పట్టించినట్లుగా మోహన్‌బాబు పత్రికా ప్రకటనలో పేర్కొనడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది’.
‘ఇప్పుడు మోహన్‌బాబు ‘సలీమ్’ చిత్ర నిర్మాణ సమయంలో నేను కొనుక్కున్న అర ఎకరం స్థలంలోకి నన్ను, నా మనుషుల్ని రానీకుండా అడ్డుకోవడం, ఆటంకాలు కల్పించడం తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. నా కష్టార్జితంతో నేను కొనుక్కున్న నా ఇంటి స్థలం విషయంలో ఆయన సమస్యలు సృష్టిస్తుండటంతో.. ఇన్నేళ్లుగా జరిగిన, జరుగుతున్న ఉదంతాలపై శాశ్వత పరిష్కారం కోసం నేను న్యాయ నిపుణులను ఆశ్రయించా’ అంటూ తన న్యాయవాదులు మోహన్‌బాబుకు పంపిన లీగల్ నోటీసును వైవీఎస్ చౌదరి విడుదల చేశారు. చెక్‌బౌన్స్ కేసుకు సంబంధించి న్యాయస్థానం మోహన్‌బాబుకు ఏడాది జైలుశిక్ష విధించింది. ఆయన రూ.40.లక్షలు చెల్లించేందుకు సమ్మతి తెలపడంతో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. డబ్బు చెల్లించేందుకు దాదాపు 30 రోజులు గడువు అడిగారు. 2010లో వైవీఎస్ చౌదరి కోర్టును ఆశ్రయించగా.. 2019లో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- పార్లమెంట్‌కు చిదంబరం..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
