close

తాజా వార్తలు

మనవడిగా తనయుడు

నాగార్జున కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘సోగ్గాడే చిన్నినాయిన’ నిలిచింది. ఇందులో రెండు పాత్రల్లో నటించి అలరించిన నాగార్జున, అభిమానులకు చక్కటి వినోదాన్ని పంచిపెట్టారు. ఇప్పుడు ఈ చిత్రానికి రెండో భాగంగా ‘బంగార్రాజు’ వస్తోంది. నాగార్జునకు తోడుగా మరో పాత్ర కూడా ఈ కథలో ఉంది. ‘బంగార్రాజు’కీ అతని మనవడికీ జరిగే కథ ఇది. ఆ పాత్రలో అఖిల్‌ కనిపించనున్నారని సమాచారం. ఇంతకు ముందు ఈ పాత్ర కోసం నాగచైతన్య పేరు పరిశీలించారు. అయితే చైతూ కంటే, అఖిల్‌కి ఈ పాత్ర బాగుంటుందని అఖిల్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నారు. ‘మన్మథుడు 2’ షూటింగ్‌లో ఉన్నారు నాగార్జున. ఆ సినిమా పూర్తయ్యాకే ‘బంగార్రాజు’ పట్టాలెక్కుతుంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.