Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 83212
            [news_title_telugu_html] => 

నాన్నకు ఏం చెప్పాలని భయపడ్డా: చైతన్య

[news_title_telugu] => నాన్నకు ఏం చెప్పాలని భయపడ్డా: చైతన్య [news_title_english] => i am scared about majili results say naga chaitanya [news_short_description] => నిజ జీవితంలోనే కాదు.. కెరీర్‌లోనూ వారిద్దరు హిట్‌ జోడీనే. నటనలో ఇద్దరూ ప్రేక్షకుల మన్ననలు పొందారు. వారెవరో కాదు.. అక్కినేని వారసుడిగా పరిచయమై నేడు కథానాయకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న... [news_tags_keywords] => samantha,naga chaitanya,majili [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/PkubDen3DmQ [news_videoinfo] => |https://www.youtube.com/embed/PkubDen3DmQ [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-04-13 18:06:25 [news_isactive] => 1 [news_status] => 2 ) )
నాన్నకు ఏం చెప్పాలని భయపడ్డా: చైతన్య - i am scared about majili results say naga chaitanya - EENADU
close

తాజా వార్తలు

నాన్నకు ఏం చెప్పాలని భయపడ్డా: చైతన్య

మావాళ్లు చూసి మౌనంగా వెళ్లిపోయారు

ఆ బాధ మజిలీతో తీరింది: సమంత

హైదరాబాద్‌: నిజ జీవితంలోనే కాదు.. కెరీర్‌లోనూ వారిద్దరు హిట్‌ జోడీనే. నటనలో ఇద్దరూ ప్రేక్షకుల మన్ననలు పొందారు. వారెవరో కాదు.. అక్కినేని వారసుడిగా పరిచయమై నేడు కథానాయకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య, మధ్య తరగతి నుంచి వచ్చి స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న సమంత. వీరిద్దరు ఇటీవల ‘మజిలీ’తో మరో హిట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చై-సామ్‌ భార్యాభర్తల పాత్రలు పోషించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయవంతంగా రాణించడమే కాదు.. అందరి ప్రశంసలు పొందింది. ఈ సందర్భంగా చైతన్య, సమంత మీడియాతో మాట్లాడారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

* ‘మజిలీ’ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు?

సమంత: ఈ విజయం చాలా ప్రత్యేకం. పెళ్లయ్యాక మేం ఇద్దరం కలిసి చేసిన తొలి చిత్రమిది. ఈ సినిమా ఎంత ముఖ్యమో మా ఇద్దరికీ బాగా తెలుసు. సరైన సమయంలో సరైన కథ మా దగ్గరకి వచ్చింది. అన్నీ అలా కుదిరిపోయాయి. కథ విన్నప్పుడు, షూటింగ్‌ చేస్తున్నప్పుడు ‘ఈ సినిమాతో ఏదో మాయ జరుగుతుంది’ అనిపించింది. అదే జరిగింది.

* సమంత మీ లక్కీ ఛార్మ్‌ అని మరోసారి రుజువు అయ్యిందా?
సమంత: (నవ్వుతూ) తనే నా లక్కీ ఛార్మ్‌. ఎందుకంటే పెళ్లయ్యాక నా కెరీర్‌ చాలా మారింది. వరుసగా విజయాలొస్తున్నాయి.
చైతన్య: మీరన్నది నిజమే. లక్కీ అనడం కంటే నా బలం అనడం బాగుంటుంది. విజయాలు ఉన్నప్పుడు మన చుట్టూ అందరూ ఉంటారు. కానీ పరాజయాల్లో ఉన్నప్పుడు ఒకరి ప్రోత్సాహం చాలా అవసరం. అలాంటి అండ నాకు సమంత రూపంలో దొరికింది.
* ఇకపై జంటగానే కనిపిస్తారా?
 చైతన్య: ఓ హిట్టు వచ్చిందని వెంటనే మరో సినిమా చేయాలన్న ఆలోచన అస్సలు లేదు. ఇది వరకు కూడా ఇంతే. దర్శకులకు ఫోన్లు చేసి ‘మా ఇద్దరికీ సరిపడ కథ ఉందా?’ అని ఎప్పుడూ అడగలేదు. ‘మజిలీ’ అనుకోకుండా ఓ మ్యాజిక్‌లా జరిగింది. మాకు మేముగా ఏదీ ప్లాన్‌ చేయలేదు. ‘మనం’ విషయంలోనూ ఇదే జరిగింది. మేమిద్దరం మళ్లీ కలిసి పనిచేయాలంటే అలాంటి మాయ మరోటి జరగాలి.
* పూర్ణగా నాగచైతన్యని తెరపై చూసినప్పుడు ఓ ప్రేక్షకురాలిగా ఏం అనిపించింది?
సమంత: చైతన్య కెరీర్‌లోనే అత్యుత్తమ నటన ప్రదర్శించాడు. తనలో నమ్మశక్యం కాని మార్పు కనిపించింది. తన పాత్రలో రెండు షేడ్స్‌ ఉన్నాయి. వాటిని చాలా చక్కగా చూపించాడు. నాకు తెలిసిన చై ఎందుకు తెర స్క్రీన్‌ పై కనిపించడు?అనే బాధ ఉండేది. బయట తన ప్రవర్తన, నడుచుకునే విధానం, మాట్లాడే పద్ధతి చాలా గొప్పగా ఉంటాయి. అవి తెరపై కనిపించలేదేంటి? అనుకునేదాన్ని. ఆ మార్పు నాకు ‘మజిలీ’లో కనిపించింది. 
చైతన్య: నేనెప్పటికీ సమంత అభిమానినే. ద్వితీయార్ధం మొత్తం తను నడిపించింది. నా నటన బాగుందంటే కారణం తప్పకుండా సమంతనే. ప్రేమకథా చిత్రాల్లో కథానాయిక పాత్రకీ ప్రాధాన్యం ఉండాలి. అప్పుడే అలాంటి కథలకు ఆదరణ దక్కుతుంది. తను ఒప్పుకోదు కానీ.. క్లైమాక్స్‌ మొత్తం తనదే. 
* ఇంట్లో వాళ్లు ఏమన్నారు?
చైతన్య: విడుదలకు ముందే ఇంట్లో వాళ్లకు చూపించాను. సినిమా పూర్తయ్యాక నిశ్శబ్దంగా వెళ్లిపోయారు. ‘ఏం మాట్లాడకుండా అలా వెళ్లిపోయారేంటి’ అని భయపడ్డాను. మరుసటి రోజు అందరూ ఫోన్లు చేసి ‘మేం సినిమా చూసి చాలా ఎమోషన్‌ అయిపోయాం. అందుకే మాట్లాడలేకపోయాం. సినిమా మాత్రం చాలా బాగుంది’ అనే సరికి ఊపిరి పీల్చుకున్నా.

* ‘మజిలీ’ సినిమా విషయంలో భారం మొత్తం మీమీదే వేసేసినట్టున్నారు. కారణం ఏమిటి?
చైతన్య: ‘నీకో కథ నచ్చితే నువ్వే నిర్ణయం తీసేసుకో. నా వరకూ తీసుకురానవసరం లేదు’ అని నాన్నగారు ఎప్పుడూ చెబుతుంటారు. ‘మజిలీ’ కథ విన్నప్పుడు ఒక్క డౌటు కూడా నాకు రాలేదు. అందుకే ఈ సినిమా చేయాలని నాకు నేనుగా నిర్ణయం తీసేసుకున్నాను. కానీ మనసులో ఓ భయం ఉండేది. ‘నాకు నేనుగా ఒప్పుకున్న సినిమా ఇది. ఫలితం అటూ ఇటూ అయితే.. నాన్నగారికి ఏం చెప్పాలి?’ అనుకునేవాడ్ని. 
* ‘సూపర్‌ డీలక్స్‌’ చూశారా? సమంత నటన మీకెలా అనిపించింది?
చైతన్య: ఈ కథ నాకు ముందే తెలుసు. కాబట్టి సమంతని ఆ పాత్రలో చూసి షాకైపోలేదు. ఈ సినిమా చేసిన ప్రతీ నటుడికీ, నటికీ సెల్యూట్‌ చేయాలి. ఎందుకంటే ఇలాంటి కథలు చేయడానికి చాలా ధైర్యం కావాలి.
సమంత: చైతన్య జిమ్‌లో ఉన్నప్పుడు ఈ కథ తనకు చెప్పా. ‘ఈ సినిమాలో నేను నటిస్తున్నా’ అన్నాను. నా వైపు అదోరకంగా చూశాడు. ‘నువ్వు చేస్తున్నావా.. చెయ్‌ చెయ్‌’ అన్నాడు. 
* ఫలానా సినిమా చేయొద్దు అని ఎప్పుడైనా అంటే..?
సమంత: ఆయన ఎప్పుడూ చెప్పరు. అది ఆయనపై నాకు ఉన్న నమ్మకం. పెళ్లయ్యాక నాపై నాకు నమ్మకం మరింత పెరిగింది. ఇంట్లో తను ఇచ్చిన ధైర్యంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నా. ఎలాంటి పాత్ర అయినా చేయగలను అనే నమ్మకం మరింత పెరుగుతోంది. 
* వేసవిలో విహార యాత్రలకు వెళ్తున్నారా?
చైతన్య: ‘వెంకీ మామ’ షూటింగ్‌ ఉంది. కానీ మేలో కాస్త బ్రేక్‌ తీసుకుని ఎక్కడికైనా వెళ్లాలి.
సమంత: ఇప్పుడు నాకు బ్రేక్‌ చాలా అవసరం. ఎందుకంటే కెరీర్‌లో ఎప్పుడూ ఇంత ఒత్తిడి ఎదుర్కోలేదు. ‘మజిలీ’ సినిమా ఫలితం ఎలా ఉంటుందో అని చాలా బెంగపడ్డాను. దాదాపు ప్రతీ సినిమాకీ ఈ టెన్షన్‌ ఉంటుంది. కానీ ఈ సినిమాకి ఎక్కువైంది. పరీక్షలు రాస్తున్నప్పుడు పాస్‌ అవుతామో లేదో తెలిసిపోతుంది. కానీ సినిమా అలా కాదు. ఓ సినిమా ఫలితాన్ని ఎవ్వరూ ముందుగా అంచనా వేయలేరు. 
* ‘బంగార్రాజు’ ఎప్పుడు మొదలవుతుంది? 
చైతన్య: స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. జులైలో సినిమా ఉండొచ్చు. నాన్న, నేనూ కలిసి నటిస్తాం.
* ‘మన్మథుడు 2’లో మీరు కనిపిస్తారా?
సమంత: అవును.. ఆ సినిమా చేస్తున్నాను.

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.