close

తాజా వార్తలు

రజనీ ‘దర్బార్‌’లో నయనతార!

చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘దర్బార్‌’ సినిమా సెట్‌లోకి నయనతార అడుగుపెట్టారు. తలైవా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంతోష్‌ శివన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అనిరుధ్‌ బాణీలు సమకూరుస్తున్నారు. రజనీ ఇందులో పోలీస్‌ ఆఫీసర్‌గా నటించనున్నారు. ముంబయి నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇటీవల ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. వచ్చే ఏడాది సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
కాగా ఈ సినిమాలో రజనీ సరసన నయనతార నటించబోతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే మంగళవారం చిత్ర బృందం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఆమె ఇవాళ్టి నుంచి షూటింగ్‌లో పాల్గొంటున్నారని తెలిపింది. ఈ విషయాన్ని ప్రకటించడం సంతోషంగా ఉందని పేర్కొంది. రజనీ, నయన్‌ ఇప్పటికే ‘చంద్రముఖి’, ‘కథానాయకుడు’ సినిమాల కోసం కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. ఇది వారి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా కావడం విశేషం.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.