
తాజా వార్తలు
హైదరాబాద్: తెలంగాణలో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం తన మనసును కలచివేసిందని సీనియన్ నటుడు మోహన్‌బాబు అన్నారు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకుని తల్లిదండ్రుల్ని శిక్షించొద్దని కోరారు. ఈ మేరకు ఆయన ఓ ప్రటకన విడుదల చేశారు. ఇంటర్ ఫెయిల్ అయ్యామన్న మనస్తాపంతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీన్ని ఉద్దేశిస్తూ మోహన్‌బాబు మాట్లాడుతూ.. ‘భగవంతుడు జన్మనిచ్చింది ఆఖరి శ్వాస వరకూ జీవించడానికి.. ఆ జీవితాన్ని మార్కులు రాలేదనో, పరీక్షలో తప్పామనో ముగించుకుంటే తల్లిదండ్రులు, స్నేహితులు, సన్నిహితులు, బంధువులు తల్లడిల్లిపోతారు. ఇది పిల్లలు అర్థం చేసుకోవాలి. ఒక విద్యాసంస్థ అధినేతగా వేల మంది విద్యార్థుల్ని అనుక్షణం నీడలా అనుసరిస్తూ, వాళ్లకు మనోనిబ్బరాన్ని కలిగిస్తున్న నాకు.. తెలంగాణ రాష్ట్రంలో కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం మనసును కలచివేసింది. ప్రభుత్వం స్పందించింది.. తప్పు చేసిన వారిని శిక్షిస్తుంది. ఈలోగా దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని, మీరే సర్వస్వంగా జీవిస్తున్న తల్లిదండ్రుల హృదయాలను శిక్షించకండి. వారు ఎప్పుడూ మీ ఉన్నతినే కోరుకుంటారు. వారి కోసం, వారి సంతోషం కోసం కళకళలాడుతూ వారి కళ్లముందు ఎదిగి చూపిస్తామని నిర్ణయం తీసుకోండి’ అని పేర్కొన్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- రివ్యూ: వెంకీ మామ
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుస్తాం: మోదీ
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
