close

తాజా వార్తలు

వావ్‌..! ‘మన్మథుడు’ స్టంట్స్‌ చూశారా?

హైదరాబాద్‌: సినిమా సినిమాకీ టాలీవుడ్‌ ‘కింగ్’ అక్కినేని నాగార్జున మరింత హ్యాండ్సమ్‌గా తయారవుతున్నారు. ఆయన కథానాయకుడిగా ‘మన్మథుడు 2’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పోర్చుగల్‌లో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాహుల్‌.. నాగ్‌కు సంబంధించిన కొన్ని లుక్స్‌ను ఇటీవల సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. కాగా, నాగ్‌ చేసిన మరికొన్ని స్టంట్స్‌కు సంబంధించిన ఫొటోలను అభిమానుల కోసం విడుదల చేశారు.

ఫొటోలో నాగ్‌ కసరత్తులు చేస్తూ కనిపించారు. ఈ లుక్‌లో ఆయన మరింత హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ్‌కు జోడీగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తు్న్నారు. సమంత అతిథి పాత్రలో కనిపిస్తారు. నాగార్జున, పి.కిరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా కథ దాదాపుగా పోర్చుగల్‌ చుట్టూ తిరుగుతుంది. ఈ షెడ్యూల్‌తోనే  పాటలతో పాటు టాకీ పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. లక్ష్మి, వెన్నెల కిషోర్‌, రావు రమేష్‌, నాజర్‌, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.