
తాజా వార్తలు
ముంబయి: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హిజ్రా పాత్రలో నటించబోతున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. తమిళం, తెలుగులో బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్న ‘కాంచన’ సినిమా బాలీవుడ్లో రీమేక్‌గా రాబోతున్న సంగతి తెలిసిందే. సినిమాకు ‘లక్ష్మీ బాంబ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాతో రాఘవ లారెన్స్ దర్శకుడిగా బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇందులో ప్రధాన పాత్రలో నటించనున్నారు. అక్షయ్‌కు జోడీగా కియారా అడ్వాణీ నటిస్తారు.
అయితే ‘కాంచన’ చిత్రంలో ప్రముఖ నటుడు శరత్‌కుమార్ హిజ్రా పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రీమేక్‌లో అమితాబ్ బచ్చన్ హిజ్రా పాత్రలో నటించేందుకు ఒప్పుకొన్నారని వార్తలు వెలువడుతున్నాయి. అయితే అమితాబ్ పాత్ర గురించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మాధవన్, శోభితా ధూలిపాళ్ల కీలక పాత్రలు పోషించనున్నారు. 2020లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- పెళ్లే సర్వం, స్వర్గం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
