close

తాజా వార్తలు

రక్తం చిందించే ప్రతి ఒక్కరికీ అడిగే హక్కు ఉంది

‘ఎన్జీకే’ సినిమా ట్రైలర్‌ విడుదల

హైదరాబాద్‌: సూర్య, సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఎన్జీకే’. సెల్వ రాఘవన్‌ దర్శకుడు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. మే 31న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఇందులో సూర్య దేశం కోసం పోరాడే ఓ రాజకీయ నాయకుడిగా కనిపించారు.

‘ఓ చిన్న గుంపును వేసుకుని రాజకీయాల్లోకి వచ్చేస్తే.. నిన్ను రానిస్తారు అనుకున్నావా?’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభమైంది. సూర్య రాజకీయ ప్రవేశంపై ఆయన తల్లి భయపడుతూ కనిపించారు. ‘ఇలా చదువుకున్న వాళ్లంతా మనకెందుకు అని పారిపోవడం వల్లే ఈ దేశం నాశనం అయిపోయింది’ అని ఓ వ్యక్తి బాధపడుతున్నారు. ‘రక్తం చిందించి ధాన్యం పండించే ఒక్కో రైతుకీ, ఈ దేశం బాగుండాలని కష్టపడే ఒక్కో కార్మికుడికి దేన్నైనా నిలదీసి అడిగే హక్కు ఉంది’ అంటూ సూర్య ఆవేశంతో ప్రసంగించడం ఆకట్టుకుంది.

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.